వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన 

ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించాలని 

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన 

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.

లోకల్ గైడ్ : సోమవారం ఉదయం కలెక్టర్ తన ఛాంబర్ లో వ్యవసాయ, కో ఆపరేటివ్, సివిల్ సప్లై, మార్కెటింగ్ అధికారులతో ధాన్యం తరలింపు పై సమీక్ష నిర్వహించిన.ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వడ్లు ఎన్ని, మిల్లులకు, గోదాములకు తరలించింది ఎన్ని, ఇంకా కొనుగోలు కేంద్రాల్లో లోడింగ్ కావాల్సినవి ఎన్ని అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలు పడుతున్నందున రైతులు ఇబ్బందులు పడకుండా రవాణా కాంట్రాక్టర్లు ఎప్పటికప్పుడు లారీలు పంపించాలని అలసత్వం చేసే కాంట్రాక్టర్ల అనుమతి రద్దు చేసి ఇతరులకు ఇవ్వాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ను ఆదేశించారు.గోపాల్ పేట, పెద్ద మందడి, పొల్కేపాడు కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తరలించేందుకు సిద్ధంగా ఉందని వడ్లు తరలించేందుకు  వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి మిల్లుకు,  గోదాముకు సన్న వడ్లు, దొడ్డు వడ్లు 60:40 నిష్పత్తిలో పంపించాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో రైతులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, జిల్లా కో ఆపరేటివ్ అధికారి బి. రాణి, సివిల్ సప్లై అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News