జై స్వరాజ్ పార్టీ అధినేత కేఎస్ఆర్ గౌడను పరామర్శించిన జేఎస్టీయూసీ నాయకులు
లోకల్ గైడ్ :
జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడను జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర నాయకులు హైదరాబాద్లోని తిరుమల హిల్స్ కాలనీలోని తన నివాసంలో కలిసి పరామర్శించారు. కాలు ఫ్రాక్చర్ తో గత రెండు నెలలుగా బాధ పడుతున్న కేఎస్ఆర్ గౌడ త్వరగా కోలుకొని ప్రజా క్షేత్రంలోకి రావాలని జెస్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి మాటూరి కృష్ణ మోహన్, మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీ జేఎస్టీయూసీ అధ్యక్షుడు ఇంజ గణేష్, ఉపాధ్యక్షుడు బొడికల వెంకట్, ప్రధాన కార్యదర్శి జయరాజ్ తదితరులు ఆకాంక్షించారు. త్వరలో అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై పోరాటానికి కార్యాచరణ చేపడదామని కార్మిక నాయకులతో ఈ సందర్భంగా కేఎస్ఆర్ గౌడ అన్నారు. మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీలో జేఎస్టీయూసీ నిర్వహించే మే డే ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని కేఎస్ఆర్ గౌడను ఇంజ గణేష్ ఆహ్వానించారు.
Comment List