తండ్రిని కోల్పోయిన చిన్నారి సాత్వికకు ఆశ్రయంగా నిలిచిన హరీశ్‌రావు.
లోకల్ గైడ్ :
తండ్రిని కోల్పయి పుట్టెడు దుఃఖంలో ఉన్న చిన్నారి సాత్వికకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు బాసటగా నిలిచారు. ఇటీవల సిద్దిపేటలో నిర్వహించిన విద్యార్థుల అవగాహన కార్యక్రమంలో విద్యార్థిని ఆవేదన విన్న హరీశ్ రావు సభా వేదిక పైనే కన్నీరు మున్నీరయ్యారు. తండ్రిని కోల్పయి పుట్టెడు దుఃఖంలో ఉన్న చిన్నారి సాత్వికకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు బాసటగా నిలిచారు. ఇటీవల సిద్దిపేటలో నిర్వహించిన విద్యార్థుల అవగాహన కార్యక్రమంలో విద్యార్థిని ఆవేదన విన్న హరీశ్ రావు సభా వేదిక పైనే కన్నీరు మున్నీరయ్యారు. అధైర్య పడవద్దని తాను అండగా ఉంటానని తల్లీబిడ్డలకు భరోసా ఇచ్చారు. అన్న మాట ప్రకారం నేడు ఆ తల్లీబిడ్డలను సిద్దిపేట క్యాంప్ ఆఫీసుకు పిలుచుకున్నారు. ఆప్యాయంగా పలకరిస్తూ వారితో కలిసి టిఫిన్ చేశారు. చిన్నారి ఆవేదన విని కరిగిపోయిన వ్యాపార వేత్త తిరుమల్ రెడ్డి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు రాగా, 2లక్షల చెక్కును హరీశ్ రావు తన చేతుల మీదుగా తల్లీబిడ్డలకు అందించారు. ఆర్థిక సాయం చేసి మానవత్వం చాటుకున్న తిరుమల్ రెడ్డిని హరీశ్‌రావు ప్రత్యేకంగా అభినందించారు. చిన్నారి భవిష్యత్తుకు తాను భరోసాగా ఉంటానని ఆవేదన చెందవద్దని హరీశ్ రావు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.భద్రంగా ఉండండి.. భవిష్యత్ లో ఎదగాలి అనే కార్యక్రమంలో సిద్దిపేట పట్టణానికి చెందిన నాగరాజు – విజయ దంపతుల కూతురు సాత్విక పాల్గొంది. కార్యక్రమంలో అమ్మానాన్నల గురించి వివరించే సమయంలో చిన్నారి సాత్విక స్టేజి మీదకు వచ్చి తనకు నాన్న లేడని చెప్పింది. అమ్మను ఎప్పుడూ ఇబ్బంది పెడుతున్నా అంటూ ఏడ్చేసింది. అది చూసి అక్కడే ఉన్న హరీశ్‌రావు చలించిపోయారు. తండ్రిని కోల్పోయి, తల్లిని ఇబ్బంది పెడుతున్నా అని ఆవేదనతో చిన్నారి చెప్పడంతో హరీశ్‌రావు మనసు కదిలిపోయింది. ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ చిన్నారిని దగ్గరికి పిలుచుకుని ఆత్మీయంగా ముచ్చటించారు. తన బాగోగులు తెలుసుకున్నారు. మీటింగ్ జరిగే సమయంలోనే హరీశ్ రావు మిత్రుని సహాయంతో హైదరాబాద్ కు చెందిన వ్యాపార వేత్త తిరుమల్ రెడ్డి చిన్నారి కుటుంబానికి అండగా ఉంటానని, తన వంతుగా 2లక్షలు సహాయం చేస్తా అని హరీశ్ రావుతో ఫోన్లో చెప్పారు.
Comment List