జిల్లాలో జూన్ మొదటి వారం వరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియ

హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

జిల్లాలో జూన్ మొదటి వారం వరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియ

•కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్*

•గోదాంలో  బియ్యం నిల్వలను  తనిఖీ చేసిన కలెక్టర్*

లోకల్ గైడ్:

జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను జూన్ మొదటి వారం వరకు నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో డిఆర్డిఏ ఐకెపి ద్వారా  కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు.ఈ ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఇప్పటివరకు వచ్చిన ధాన్యం, ఎంత ధాన్యం కొనుగోలు చేసిన వివరాలతో పాటు ధాన్యపు సంచులు, టార్పాలిన్ కవర్లు, రికార్డుల నిర్వహణ, ధాన్యం అమ్మిన రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం, మిల్లులకు ధాన్యం తరలింపు, తదితర వివరాలను జిల్లా కలెక్టర్ అధికారులు, ధాన్యం కొనుగోలు కేంద్రం  నిర్వాహకులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద  ఆరబోసిన ధాన్యాన్ని కలెక్టర్ పరిశీలించారు. మాయిశ్చరైజర్ మిషన్ ద్వారా  తేమ శాతాన్ని  చూస్తున్నారా అని నిర్వాహకులను  కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.అనంతరం మీడియాతో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ కమలాపూర్ లో ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటివరకు రెండువేల క్వింటాల సన్న, దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 150 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండగా ఇందులో 110 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగుతుందన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని 37 మిల్లులకు  తరలిస్తున్నట్లు  కలెక్టర్ పేర్కొన్నారు. అకాల వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద  సరిపోను  టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం ద్వారా వాతావరణ పరిస్థితులను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సమాచారాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గత సీజన్ మాదిరిగానే సన్న, దొడ్డు రకం ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు.  సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన విధంగా బోనస్ ను అందజేయడం జరుగుతుందన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ జూన్ మొదటి వారం వరకు కొనసాగే దృష్ట్యా వీటన్నింటిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద   అన్ని ఏర్పాట్లను పూర్తి చేసామన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన అనంతరం  మార్కెట్ యార్డు లోని  గోదాముల్లో  బియ్యం నిల్వలను  అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమలాపూర్ మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ ఝాన్సీ రాణి, వైస్ చైర్మన్ ఐలయ్య, హనుమకొండ ఆర్డిఓ రాథోడ్ రమేష్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కొమరయ్య, స్థానిక ఎంపీడీవో గుండె బాబు, ఇతర అధికారులతో పాటు స్థానిక రైతులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News