హైదరాబాద్ డివిజన్‌లోని కర్నూల్ సిటీ

సికింద్రాబాద్ సెక్షన్‌ను తనిఖీ చేసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్

హైదరాబాద్ డివిజన్‌లోని కర్నూల్ సిటీ

లోకల్ గైడ్ :

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ గురువారం హైదరాబాద్ డివిజన్‌లోని కర్నూల్ సిటీ- సికింద్రాబాద్ సెక్షన్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ సమయంలో ఆయనతో పాటు హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ లోకేష్ విష్ణోయ్ మరియు ప్రధాన కార్యాలయం మరియు డివిజన్ నుండి ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు. అరుణ్ కుమార్ జైన్ శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగుళాంబ హాల్ట్ స్టేషన్‌ నుండి తనిఖీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణీకుల సౌకర్యాలు, స్టేషన్ ఆస్తులు మరియు స్టేషన్ పరిసర ప్రాంగణాన్ని పరిశీలించారు. అమృత్ భారత్ స్టేషన్ పధకం (ఏ.బి.ఎస్.ఎస్.) లో భాగంగా రూ. 6.07 కోట్ల వ్యయంతో స్టేషన్‌లో జరుగుతున్న పునరాభివృద్ధి పనుల పురోగతిని కూడా ఆయన సమీక్షించారు. నిర్మాణ పనులు పురోగతిలోనున్నపుడు పాటిస్తున్న భద్రతా విధానాలు మరియు మార్గదర్శకాలను ఆయన పరిశీలించారు. అలాగే, నిర్దేశించిన  సమయంలోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తదుపరి జనరల్ మేనేజర్ కర్నూల్ లో నిర్మిస్తున్న కోచ్ మిడ్‌లైఫ్ రిహాబిలిటేషన్ వర్క్‌షాప్ (సి.ఎమ్.ఎల్.ఆర్)కి నూతన  లైన్ అనుసంధానాన్నికి  సంబంధించిన నిర్మాణ పనులను పరిశీలించారు. కొత్త లైన్ మరియు వర్క్‌షాప్ నిర్మాణ పనుల పురోగతిని అధికారులు జనరల్ మేనేజర్‌కు వివరించారు. జనరల్ మేనేజర్ కర్నూలులో సి.ఎమ్.ఎల్.ఆర్ వర్క్ షాప్ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. సి. ఎమ్.ఎల్.ఆర్ వర్క్‌షాప్ నిర్మాణ పనులకై  2013-14 సంవత్సరంలో ప్రాధమికంగా 283 కోట్ల అంచనా  వ్యయంతో మంజూరు చేయబడి తరువాత దానిని  రూ. 562 కోట్లకు సవరించబడింది. ఈ వర్క్‌షాప్ పూర్తయిన తర్వాత, నెలకు 50 కోచ్‌లను మరమ్మతు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వర్క్‌షాప్‌లో అవసరమైన యంత్రాలు కూడా అమర్చబడతాయి, తద్వారా కోచ్‌ల కాలానుగుణ ఓవర్ హాలింగ్ ఇక్కడ చేయవచ్చు. మొదటి దశలో నాన్-ఏసీ కోచ్‌ల మరమ్మత్తు చేపట్టే పని పూర్తవుతుంది మరియు తరువాత ఏసీ కోచ్‌ల నిర్వహణను చేపట్టడానికి వర్క్‌షాప్‌ను పెంచుతారు.  కర్నూలు ఎంపీ శ్రీ నాగరాజు బస్తీపతి జనరల్ మేనేజర్‌ను కలిసి తన అధికార పరిధికి సంబంధించిన రైలు అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు. ఆ తరువాత జనరల్ మేనేజర్ కర్నూల్ సిటీ రైల్వే స్టేషన్‌ తనిఖీచేసి ప్రయాణీకుల సౌకర్యాలు/వసతులు, స్టేషన్‌లోని సర్క్యులేటింగ్ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. కర్నూల్ సిటీ రైల్వే స్టేషన్‌లో రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ఆయన ప్రారంభించారు మరియు స్టేడియంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఓపెన్ జిమ్, పిల్లల ఆట స్థలం మొదలైన వాటిని సమీక్షించారు మరియు పచ్చని వాతావరణం కోసం ఒక మొక్కను నాటారు. రైల్వే ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు ఆధునిక క్రీడా పరికరాలను ఉపయోగించడం ద్వారా వారి క్రీడా నైపుణ్యాలు మరియు వ్యక్తిత్వ ఫిట్‌నెస్‌ను పెంపొందించుకోవడానికి ఈ స్టేడియం ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తరువాత, జనరల్ మేనేజర్ కర్నూలు నుండి సికింద్రాబాద్ సెక్షన్ వరకు రియర్ విండో తనిఖీని నిర్వహించారు. ఈ తనిఖీలో  వంపులు, వాలుతలం , వంతెనలు, సిగ్నల్స్ మరియు ట్రాక్‌ల నిర్వహణ మొదలైన అనేక భద్రతా అంశాలను సమీక్షించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పాకిస్తాన్ తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కాశ్మీర్ లో ఉగ్రవాదుల కోసం భారత్ తన అన్వేషణను ముమ్మరం చేసింది. పాకిస్తాన్ తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కాశ్మీర్ లో ఉగ్రవాదుల కోసం భారత్ తన అన్వేషణను ముమ్మరం చేసింది.
శుక్రవారం నాడు, సాయుధ పోలీసులు మరియు సైనికులు భారత కాశ్మీర్‌లోని ఇళ్ళు మరియు అడవులను ఉగ్రవాదుల కోసం వెతుకుతూ గాలింపు చేపట్టారు, ఈ వారం ప్రారంభంలో 26...
"పాకిస్థాన్ పౌరులను గుర్తించి, వారిని తిరిగి పంపించండి": రాష్ట్ర ముఖ్యమంత్రులకు అమిత్ షా ఆదేశం
ప‌రాయి నేలపై టీ20 లీగ్‌... చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన న్యూజిలాండ్.
తండ్రిని కోల్పోయిన చిన్నారి సాత్విక‌కు ఆశ్రయంగా నిలిచిన హరీశ్‌రావు.
పెళ్ళాం జుట్టు పట్టి కొట్టిందని ప్రియురాలు దగ్గరకి పోతే | Telugu Latest Short Films | LG Films
MEENA SINGER PART 2
ఆది మరుపుల మొగడు | Telugu Latest Short Films | Sydulumama | LG FILMS #comedy #shortfilm #lgfilms