“తెలంగాణ: ఫ్యూచర్ రెడీ” – ఉపాధ్యాయ సంఘాలతో ఉన్నత స్థాయి సమావేశం
లోకల్ గైడ్ :
విద్యా శాఖ ప్రభుత్వ కార్యదర్శి డా. యోగితా రాణా, ఐఏఎస్ ఆధ్వర్యంలో “తెలంగాణ: ఫ్యూచర్ రెడీ” పేరిట ఉపాధ్యాయ సంఘాలతో ఒక ప్రత్యేక సమావేశం హైదరాబాద్‌లోని గోదావరి హాల్, ఎస్ సి ఆర్ ప్రాంగణంలో నిర్వహించబడింది.ముందుగా నరసింహారెడ్డి ఐఏఎస్ డీఎస్సీ మన తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల పెర్ఫార్మన్స్ నాసర్ల లో ఏవిధంగా ఉంది ,స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ గౌటు స్కూల్లో ఏవిధంగా తగ్గుతుందో పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు.సెక్రెటరీ మేడం మాట్లాడుతూ నాణ్యమైన విద్యను మరియు క్వాలిటీ ని పెంచడానికి మరియు ఎన్రోల్మెంట్ పెంచడానికి సలహాలు కోరడం జరిగింది.ఉపాధ్యాయ సంఘాలు పాఠశాలలను దత్తత తీసుకొని క్వాలిటీ పెంచాలని కోరడం జరిగింది.తదనుగుణంగా అన్ని సంఘాల నాయకులు మాట్లాడుతూ ఈ క్రింద తెలిపిన సలహాలు /సూచనలు చేయడం జరిగింది.బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంచడానికి అందరూ కృషి చేయాలని సూచించారు .ఇట్టి కార్యక్రమాన్ని జూన్ లో కాకుండా ఏప్రిల్ లో లేదా మే చివరి వారం లో నిర్వహిస్తే బాగుంటుందని చెప్పారు .ప్రీ ప్రైమరీ తరగతులను ప్రభుత్వ పాఠశాల లో ప్రారంభిస్తే ఎన్రోల్మెంట్ పెరగడఎం టీచర్ ట్రైనింగ్స్ సెలవు దినాలలో జరిపితే బాగుంటుంది.ఎక్స్పోజర్ విజిట్ టు గుడ్ స్కూల్స్ కార్యక్రమం పెడితే బాగుంటుంది. అంగన్వాడీ కేంద్రాల ను ప్రే ప్రైమరీ స్కూల్ తో అనుసంధానం చేస్తే ఎన్రోల్మెంట్ పెరుగుతుంది.టీచర్ ట్రైనింగ్స్ సెలవు దినాలలో సమ్మర్ వెకేషన్ జరిపితే బాగుంటుంది.టీచర్స్ ట్రైనింగ్స్ క్వాలిటీ రిసోర్స్ పర్సన్స్ ద్వారా ఇప్పించడం వల్ల టీచర్ల కెపాసిటీ బిల్డింగ్ జరుగుతుందని తద్వారా క్వాలిటీ పెరగడానికి అవకాశం ఉందని తెలిపారు. ఇటీవల తీసుకున్న రిసోర్స్ పర్సన్స్ ఎంపిక కమిటీ ద్వారా తీసుకోవడాన్ని స్వాగతించారు మరియు అభినందించారు.సైకాలజిస్ట్ తో ఉపాధ్యాయులకు మోటివేషన్ మరియు కౌన్సిలింగ్ నిర్వహించాలి.ఇన్ఫెక్షన్ సిస్టం ను బలోపేతం చేయడం ద్వారా క్వాలిటీ ని పెంచవచ్చు.రేషనలైజేషన్ ఆఫ్ టీచర్స్ చేస్తే నాణ్యమైన విద్యను అందివ్వవచ్చు.తరగతి గది లో టీచర్స్ విద్యార్థులతో మమేకమవ్వడం అత్యంత అవసరం.ప్రభుత్వ పాఠశాల యొక్క పేస్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. రూల్స్ కి విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ స్కూల్స్ పై చర్యలు తీసుకోవాలి. కాంప్లెక్స్ మీటింగ్స్ పకడ్బందీగా ఉద్దేశం నెరవేరేలా జరగాలి ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండేలా చూస్తే పేరెంట్స్ కు నమ్మకం పెరిగి క్వాలిటీ పెరగడానికి అవకాశం ఉంది.స్పోకెన్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ ని స్కూల్స్ లో అమలు చేస్తే విద్యార్థులు సులభంగా ఇంగ్లీష్ లో మాట్లాడగలరు.మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రస్తుత టెక్స్టుబుక్స్ సిలబస్ ను మార్పు చేస్తే బాగుంటుంది.రెగ్యులర్ డీఈవోలను , ఎంఈఓ లను నియమించాలని కోరడం జరిగింది.పాఠశాలల మానిటరింగ్ ని పెంచాలి.స్పోర్ట్స్ ని ఫిజికల్ ఎడ్యుకేషన్ ని ప్రతి స్కూల్ లో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి.ఎన్రోల్మెంట్ ఎక్కువగా ఉన్న స్కూల్స్ ని అధికారులు విజిట్ చేస్తే బాగుంటుంది తద్వారా జస్ట్ బెస్ట్ ప్రాక్టీస్ ని మిగతా స్కూలుకి కూడా అమలు పర్చేలా చూడాలి.ఉపాధ్యాయులకు బోధనేతర పనులను తగ్గించి స్టూడెంట్స్ క్వాలిటీ మీద ఫోకస్ పెట్టాలి.ఉపాధ్యాయులు మెటర్నిటీ లీవ్ లో ,డిప్యుటేషన్ లో ఉన్నప్పుడు ఇంకొక టీచర్ ని తాత్కాలికంగా నియమించాలి.చాలా మంచిగా పనిచేస్తున్న పాఠశాలలు పబ్లిసిటీ చేసుకోవడం లేదు.ఫ్లెక్సీ ద్వారా ,లోకల్ టీవీ ఛానల్ లో పత్రికల ద్వారా ప్రచారం చేసుకోవాలి.అధికారులే గుర్తించి ఇవ్వాలి. సభలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు, విద్యార్ధుల పునాది విద్యాభివృద్ధి, వంటి ముఖ్య అంశాలపై చర్చ జరిగింది. డా. యోగితా రాణా ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో ప్రత్యక్షంగా పరస్పర చర్చలు జరిపారు.విద్యా శాఖ, ప్రభుత్వ పాఠశాలల పురోగతికి ఉపాధ్యాయులతో కలసి పని చేయనున్న దృఢ సంకల్పాన్ని ఈ సమావేశంలో పునరుద్ఘాటించింది.విద్యార్థుల నమోదు విద్యా నాణ్యత ప్రమాణాలను పెంచడానికి ఈ కార్యక్రమం నిర్వహించడాన్ని అన్ని సంఘాల నాయకులు స్వాగతించారు.తరచుగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.ఇట్టి కార్యక్రమంలో ఈ.వి. నరసింహా రెడ్డి ఐఏఎస్, పాఠశాల విద్యా డైరెక్టర్ , ఎ. శ్రీదేవసేన, ఐఏఎస్ కళాశాల సాంకేతిక విద్యా కమిషనర్, ఎం. హరిత, ఐఏఎస్, విద్యా శాఖ ప్రత్యేక కార్యదర్శి, మరియు పాఠశాల విద్యా శాఖకు చెందిన అందరూ అదనపు సంచాలకులు పాల్గొన్నారు.
Comment List