విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
విద్యార్థుల విజయానికి తల్లిదండ్రులకు ప్రోత్సాహం ఎంతో అవసరం.
విద్యార్థులు తమ ప్రతిభను జాతీయస్థాయిలో ప్రదర్శించడం అభినందనీయం.
ఆర్బిఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి.
లోకల్ గైడ్:
ఆధునిక పోటీ ప్రపంచంతో పోటీ పడాలంటే విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలని ఆర్బిఓఎల్ సీఈవో బుయ్యని శ్రీనివాసరెడ్డి విద్యార్థులకు సూచించారు. గురువారం తాండూర్ పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు, జాతీయ స్థాయిలో జరిగిన సైన్స్ ఫెయిర్ పోటీలో అద్వితీయ ప్రతిభ కనబరిచారు. వారి విజయం స్కూల్ కు గర్వకారణంగా నిలిచింది అని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో అధ్యాపకుల సమర్పణకు గుర్తింపు, ఉత్తమ విద్యార్థుల ఎంపిక, మరియు వివిధ రంగాల్లో రాణించిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది.ఈ ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ...విద్యార్థులు పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి అని పేర్కొన్నారు.తాండూర్ విద్యార్థులు తమ నైపుణ్యాన్ని జాతీయ స్థాయిలో ప్రదర్శించడం అత్యంత అభినందనీయం అని ప్రశంసించారు. కాగా విద్యార్థుల విజయానికి తల్లిదండ్రుల మద్దతు, గురువుల ఉత్సాహభరిత ప్రోత్సాహం అత్యంత కీలకం అని సూచించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో రాణించేలా ప్రేరేపించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Comment List