యధేచ్చగా..ఫుట్ పాత్ ఆక్రమణలు పట్టించుకోని అధికారులు

యధేచ్చగా..ఫుట్ పాత్ ఆక్రమణలు పట్టించుకోని అధికారులు

మల్కాజిగిరి: లోకల్ గైడ్ తెలంగాణ,మల్కాజిగిరి సఫిల్ గూడ లో  పుట్ పాత్   ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకునే నాథుడే లేడు.చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూడటం లేదు. సరి కదా ఇదే అదనుగా భావించిన ఆక్రమణ దారులు కమర్షియల్ షెటర్ దుకాణం వేసుకుని ఎంచక్కా కిరాయికి ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నా మల్కాజిగిరి సర్కిల్ అధికారులు ఎవ్వరూ చర్యలు తీసుకోవడం లేదని  విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. అసలే ఇది ప్రధాన రోడ్.  పాదచారులు నడిచేందుకు వీలుగా నిర్మించిన ఫుట్ పాత్ లను  పూర్తిగా మూసి వేసి, అక్రమంగా వ్యాపారం చేసుకుంటున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకో వడం లేదని వారి పని తీరుపై స్ధానికులు పలువురు అను మానం వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలదన్నట్టు పుట్ ఫాత్ ఆక్రమణతో పాటు రోడ్డుపైనే  వాహనాలు పార్కింగ్ చేస్తుండటంతో పాదచారులు నడిచేందుకు దారి లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒక్కోసారి రోడ్డుపై నడక సాగించే పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రభుత్వం లక్షలకు లక్షలు వెచ్చించి ఫుట్ పాత్ నిర్మించినా, ఇవి ఆక్రమణకు గురి కావడంతో పాదచారులకు నిరుపయోగంగా మారాయి. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ఫుట్ పాత్ ఆక్రమణ దారులపై తగిన చర్యలు తీసుకోవాలని పాదచారులు, స్ధానికులు కోరుతున్నారు

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News