ఓ విద్యార్థులారా ఫలితాలకన్నా ప్రాణమే ప్రధానం
మార్కులు కాదు – మనోస్థైర్యమే ముఖ్యం
ఓ విద్యార్థులారా ఫలితాలకన్నా ప్రాణమే ప్రధానం
మార్కులు కాదు – మనోస్థైర్యమే ముఖ్యం
ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులపై విద్యా ఒత్తిడి విపరీతంగా పెరిగింది. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తామో! లేదో అనే భయంతో విద్యార్థులు
మానసిక ఆందోళనకు గురవుతున్నారు.ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు,కార్పొరేట్ విద్యా సంస్థలు నడిపించే ప్రతినిధులు ఒక విషయం మరిచిపోతున్నారూ. మార్కులు ర్యాంకులే ముఖ్యం కాదు
జీవితం ఎంతో గొప్పదని తెలుసుకోలేకపోతున్నారూ.
మార్కులు తక్కువ వస్తే జీవితమే నాశనమా?
ఒకసారి పరీక్షలో ఫెయిల్ అవుతే జీవితమంతా ఫెయిలైపోయిందనుకోవడం సరికాదు.మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా,విజయం తరచూ ఒక్కసారి రాదు. మార్కులు కేవలం విద్యావ్యవస్థలో ఒక ప్రమాణం మాత్రమే,కానీ అవి వ్యక్తిత్వాన్ని,సామర్థ్యాన్ని పూర్తిగా కొలవలేవు.
తల్లిదండ్రులకూ,మిత్రులకూ, సమాజానికీ ఒక విద్యార్థి జీవితం ఎంతో విలువైనది. పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే తండ్రి తలవంచుకున్నాడని అనిపించొచ్చు, కానీ ప్రాణం కోల్పోతే తల్లిదండ్రులకు జీవితాంతం దుఃఖ మిగులుతుంది. ఓటమిని అంగీకరించడం, ముందుకు సాగడం నేర్చుకోవాలి.
మనోస్థైర్యం. ఏదైనా పరిస్థితిని ఎదుర్కొనే ధైర్యం, తప్పిదాలనుండి నేర్చుకునే పట్టుదల వారిని ముందుకు నడిపిస్తుంది. మార్కులకన్నా ఈ లక్షణాలు జీవితంలో ఎంతో దూరం తీసుకెళ్తాయి.
విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించాలంటే ముందుగా తమ మనస్సును బలపరుచుకోవాలి. ఓటములు వచ్చినా జీవితాన్ని ప్రేమించాలి. పరీక్షల్లోని విజయాలు తాత్కాలికమైనవే కానీ ప్రాణం మాత్రం ఎనెన్నో అవకాశాల రహదారి. విద్యార్థులారా గుర్తుంచుకో జీవితం ముందు, మార్కులు తర్వాత. మార్కుల కోసం ప్రాణం తీసుకోకండి జీవితం ఎంతో విలువైనది. ప్రాణం ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చు ఇకనైనా తల్లిదండ్రులు తమ పిల్లలకు నచ్చిన దారిలో వెళ్లే విధంగా వారిని ప్రోత్సహించి విజయం సాధించే విధంగా సహాయ, సహకారాలు అందిస్తే ప్రతి విద్యార్థి విజేతగా నిలుస్తాడు.
🙏🏻🙏🏻
వ్యాసకర్త
వి.జానకి రాములు గౌడ్
లింగంధన
Comment List