ఫ్యామిలీతో కలిసి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్న అల్లు అర్జున్!..
లోకల్ గైడ్,ఆన్లైన్ డెస్క్ :- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఫ్యామిలీతో కలిసి అల్లు అర్జున్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అల్లు అర్జున్ భార్య స్నేహ, కొడుకు అయాన్, కూతురు అర్హత కలిసి అల్లు అర్జున్ కేక్ కట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్ములలో వైరల్ గా మారిపోయాయి. సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలియజేశాడు. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా చాలామంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా లక్షలాది మంది బర్త్డే విషెస్ తెలుపుతున్నారు. హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ అన్న అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్రెండును సృష్టిస్తున్నారు. కాగా అల్లు అర్జున్ పుష్ప మొదటి భాగం అలాగే రెండవ భాగం ద్వారా వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో దేశంలోనే కాకుండా విదేశాల అభిమానుల నుండి కూడా అల్లు అర్జున్ కు బర్త్ డే విషెస్ వస్తున్నాయి.
Comment List