ముందుస్తు గా ఉగాది వేడుకలు.
By Ram Reddy
On
లోకల్ గైడ్ తెలంగాణ:
లక్షెట్టిపేట : మండలంలోని దౌడేపల్లి ప్రాథమిక పాఠశాలలో విశ్వవసు నామ సంవత్సర ముందస్తు ఉగాది వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గిరిధర్ మాట్లాడుతూ... ఉగాదిలో ఉగ' అంటే నక్షత్ర గమనం, నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనది ఉగాది. యుగం అనగా 'ద్వయం; లేదా 'జంట' అని అర్థం. ఉత్తారయణ, దక్షిణాయణ ద్వయ సంయుతం యుగం కాగా.. ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందిందని దాని ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. అనంతరం ఉగాది పచ్చడి తయారు చేసి విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు సతీష్ ,విద్యార్థులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
08 Apr 2025 16:20:34
లోకల్ గైడ్:
జైపూర్ నుంచి ముంబైకి బయలుదేరిన 6E 5324 నెంబర్ ఇండిగో విమానం టాయిలెట్స్‌లో లభ్యమైన ఓ లేఖ తీవ్ర కలకలం రేపింది. విమానంలో బాంబుపెట్టామని...
Comment List