పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ 

పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ 

లోకల్ గైడ్ తెలంగాణ:

పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాదరావు పరిశీలించారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 97 పరీక్ష కేంద్రాలలో కొనసాగుతున్న పరీక్షలను పురస్కారించుకొని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ బందోబస్తు పరిశీలించేందుకు శనివారం నగరంలోని పలు పరీక్ష కేంద్రాలను సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి తగిన సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలులో వున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాల పరిసరాలలో ఇంటర్నెట్ సెంటర్లు , జిరాక్స్ సెంటర్లు, స్టేషనరీ షాపులు ఆయా సమయాలలో ముసివేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.  ట్రాఫిక్ ఆంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీస్ అధికారులకు ఆదేశించారు.  అదేవిధంగా ఏలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డిజేలతో ఉరేగింపులు, దర్నలు, ప్రచారాలు నిర్వహించకుండా పోలీస్ పెట్రోలింగ్, పటిష్టమైన బందోబస్తు పర్యవేక్షణ వుండాలని సూచించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News