క్షయ వ్యాధి లక్షణములు, జాగ్రత్తల పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

క్షయ వ్యాధి లక్షణములు, జాగ్రత్తల పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

లోకల్ గైడ్ తెలంగాణ:

ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా కాజీపేట్ లోని డీజిల్ లోకో షెడ్ లో క్షయ వ్యాధి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. లోకో షెడ్ లో పని చేస్తున్న దాదాపు 400 మంది సిబ్బంది ఈ సదస్సుకు హాజరు అయ్యారు. ఈ సదస్సులో టిబి నియంత్రణ అధికారి డాక్టర్  హిమబిందు మాట్లాడుతూ,టిబి రహిత సమాజo కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఇందు కోసం  ప్రతి ఒక్కరు క్షయ వ్యాధిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఎవరికైనా రెండు వారాల కు మించి దగ్గు, జ్వరం రావడం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం లాంటి లక్షణాలు ఉంటే దగ్గర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, పట్టణ ఆరోగ్య కేంద్రo కు వెళ్ళి  తెమడ పరీక్ష చేయించుకోవాలని, ఒకవేళ వ్యాధి నిర్ధారణ జరిగితే ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటు  నిక్షయ్ పోషణ యోజన ద్వారా మంచి పోషకాహారం తీసుకోవడానికి పోషణార్థం ప్రతినెల 1000 రూపాయలు చొప్పున ఆరు నెలలు వారి యొక్క బ్యాంకు ఖాతాలోనే నేరుగా జమ చేయడం జరుగుతుందన్నారు. ఎలాంటి అశ్రద్ద చేయకుండా మందులు వాడినట్లైతే పూర్తిగా నయం అవుతుందన్నారు. కార్యక్రమంలో రైల్వే వైద్య అధికారి డాక్టర్ ధీరజ్ కుమార్, జిల్లా మాస్ మీడియా అధికారి వి. అశోక్ రెడ్డి వివిధ అంశాలపై అవగాహన కలిగించారు. ఈ సదస్సులో సీనియర్ డిఎమ్ఈ డీజిల్ లోకో షెడ్ ఎన్ వి వెంకట కుమార్,  డాక్టర్ ధీరజ్ కుమార్, సోమిడి వైద్య అధికారి డాక్టర్ అనిత, జిల్లా మాస్ మీడియా అధికారి వి. అశోక్ రెడ్డి,  జిల్లా  క్షయ వ్యాధి సమన్వయ అధికారి సుష్మ , టీబి కోఆర్డినేటర్ పి కిరణ్ కుమార్, డిపిపిఎమ్ డి నగేష్ ,సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ టీ విజయ్  టీబి హెచ్ వి లు సునీత, అంజమ్మ, సి‌ఓ జ్యోతి పాల్గొనడం జరిగింది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..
లోక‌ల్ గైడ్: జైపూర్‌ నుంచి ముంబైకి బయలుదేరిన 6E 5324 నెంబర్‌ ఇండిగో విమానం టాయిలెట్స్‌లో లభ్యమైన ఓ లేఖ తీవ్ర కలకలం రేపింది. విమానంలో బాంబుపెట్టామని...
రాబోయ్ మూడు గంటల్లో ఆ మూడు జిల్లాల్లో పిడుగుల వాన
అవ‌తార్‌ని మించి అట్లీ
టాస్‌ గెలిచిన కోల్‌కతా..
నాంపల్లిలో పుస్తక ప్రదర్శన..
ఆ ఒక్క సీన్ కోసమే రాజ‌మౌళి వంద కోట్లు ఖ‌ర్చు పెడుతున్నాడా..!
 బెదిరిస్తే.. బెదురుతామా ఏందీ..?