ఇందూరు వేంకటేశ్వరస్వామి ఆలయం పల్లకీ సేవలో నిర్మాత దిల్ రాజు

ఇందూరు వేంకటేశ్వరస్వామి ఆలయం పల్లకీ సేవలో నిర్మాత దిల్ రాజు

లోక‌ల్ గైడ్:
నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలం నర్సింగ్‌పల్లిలో ప్రసిద్ధిగాంచిన ఇందూరు తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల రెండో రోజు శుక్రవారం జరిగిన ఉత్సవాల్లో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు , ఆయన సోదరులు నరసింహారెడ్డి, విజయసింహారెడ్డి, నాయకులు పల్లకీ సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శేష వాహనంపై స్వామిని ఊరేగించారు.ఆచార్య గంగోత్రి రామానుజదాసు స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. శేష వాహనం వల్ల నాగ దోషాలు తొలిగిపోతాయని స్వామి అన్నారు. యజ్ఞాచార్యులు ఆచార్య శిఖామణి స్వామి, శ్రీకర్ కుమారాచార్యులు, స్వామి రోహిత్ కుమారాచార్యులు, విజయ్ స్వామిల ఆధ్వర్యంలో పూజాదికార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..
లోక‌ల్ గైడ్: జైపూర్‌ నుంచి ముంబైకి బయలుదేరిన 6E 5324 నెంబర్‌ ఇండిగో విమానం టాయిలెట్స్‌లో లభ్యమైన ఓ లేఖ తీవ్ర కలకలం రేపింది. విమానంలో బాంబుపెట్టామని...
రాబోయ్ మూడు గంటల్లో ఆ మూడు జిల్లాల్లో పిడుగుల వాన
అవ‌తార్‌ని మించి అట్లీ
టాస్‌ గెలిచిన కోల్‌కతా..
నాంపల్లిలో పుస్తక ప్రదర్శన..
ఆ ఒక్క సీన్ కోసమే రాజ‌మౌళి వంద కోట్లు ఖ‌ర్చు పెడుతున్నాడా..!
 బెదిరిస్తే.. బెదురుతామా ఏందీ..?