జనగామ జిల్లా పేరు మార్చితే మరో పోరాటానికి సిద్ధం - జనగామ జిల్లా జేఏసీ

ప్రభుత్వం ప్రజలమధ్య విభేదాలు సృష్టించే కుట్ర ఈ అంశం..- మంగళంపల్లి రాజు

జనగామ జిల్లా పేరు మార్చితే మరో పోరాటానికి సిద్ధం - జనగామ జిల్లా జేఏసీ

జనగామ స్పూర్తి స్థూపానికి నల్ల కండువాలతో పాలాభిషేకం చేసి నిరసన తెలిపిన జేఏసీ..

లోకల్ గైడ్ తెలంగాణ:-

జనగామ జిల్లా కేంద్రంలో గల ఉద్యమ స్పూర్తి స్థూపం వద్ద మంగళంపల్లి రాజు అధ్యక్షతన సమావేశమైన జనగామ జిల్లా జేఏసీ నాయకులు జనగామ జిల్లా పేరు మార్చకుండా జేఏసీ ప్రతిగటించాలని తీర్మానించింది. ఈ సందర్భంగా ఉద్యమకారులు నల్ల కండువాలు ధరించి జనగామ జిల్లా స్పూర్తి స్థూపం(జైన స్థూపం)కి పాలాభిషేకం చేసి జిల్లా పేరు మారిస్తే ఉద్యమానికి సిద్ధం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు డిఆర్ లక్ష్మి నారాయణ నాయక్ మాట్లాడుతూ "జనగామ జిల్లా పేరు మార్చాలని కొందరు కోరుకుంటే, జనగామ జిల్లా పేరు ఉండాలని అందరూ కోరుకుంటున్నారని" తెలిపారు. జనగామ జిల్లా జేఏసీ కన్వీనర్ మంగళంపల్లి రాజు మాట్లాడుతూ జనగామ జిల్లా పేరు మార్చడం అంటే ఇక్కడి మహనీయులను అవమానించడమే అన్నారు. ఏ ఒక్కరి పేరు పెట్టిన మిగితవారిని అవమణించినట్లు మిగితా వర్గాల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని, కావున జనగామ జిల్లా పేరును యదావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు మల్లిగారి రాజు, గండి నాగరాజు, ఆకుల సతీష్, పిట్టల సురేష్, గంగా భవాని, మీసాల వెంకన్న,గన్ను కార్తీక్, ఆసర్ల సుభాష్, నర్ర నవీన్, తిరుమల్ రెడ్డి, ప్రణీత్ రెడ్డి, నల్ల రాహుల్, మద్దెల కార్తీక్, అజయ్, ఇమ్రాన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..
లోక‌ల్ గైడ్: జైపూర్‌ నుంచి ముంబైకి బయలుదేరిన 6E 5324 నెంబర్‌ ఇండిగో విమానం టాయిలెట్స్‌లో లభ్యమైన ఓ లేఖ తీవ్ర కలకలం రేపింది. విమానంలో బాంబుపెట్టామని...
రాబోయ్ మూడు గంటల్లో ఆ మూడు జిల్లాల్లో పిడుగుల వాన
అవ‌తార్‌ని మించి అట్లీ
టాస్‌ గెలిచిన కోల్‌కతా..
నాంపల్లిలో పుస్తక ప్రదర్శన..
ఆ ఒక్క సీన్ కోసమే రాజ‌మౌళి వంద కోట్లు ఖ‌ర్చు పెడుతున్నాడా..!
 బెదిరిస్తే.. బెదురుతామా ఏందీ..?