ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనది.
ప్రధానోపాధ్యాయులు విఠల్
గుర్రంపల్లి లో ఘనంగా స్వయంపాలన దినోత్సవం.
లోకల్. గైడ్ తెలంగాణ, జిల్లేడు చౌదరిగూడెం.
ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనదని,నేటి సమాజంలో ఉపాధ్యాయుల బోధనలతోనే యువత అన్ని రంగాలలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారని గుర్రం పల్లి ప్రాథమికొన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విఠల్ అన్నారు. గురువారం గుర్రంపల్లి ప్రాథమికొన్నత పాఠశాలలో విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి తమతోటి విద్యార్థులకు చక్కని విద్యా బోధన చేశారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి విద్యాబోధన చేసిన తమ అనుభవాలను వివరించారు. తమ తోటి విద్యార్థులకు చదువు చెప్పడం తమకెంతో మంచి అనుభూతిని కలిగించిందని విద్యార్థులు తెలిపారు. అలాగే విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి కిరణ్ కుమార్ రెడ్డి ,కాంప్లెక్స్ ప్రధానో పాధ్యాయురాలు కె సునీత, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ రమాదేవి, ఉపాధ్యాయురాలు సుగుణ,జవేరియా,నిర్మల, గ్రామ పెద్దలు విద్యార్థులు పాల్గొన్నారు.
Comment List