టీడబ్ల్యూజేఎఫ్ చేయూత

టీడబ్ల్యూజేఎఫ్ చేయూత

* వెలుగు పత్రిక జర్నలిస్ట్ తిరుపతికి వితరణ
* రంజాన్ కుటుంబానికి సహాయం
* యోగక్షేమాలు తెలుసుకొని అభయం
* యూనియన్లకు అతీతంగా సేవలు: టీడబ్ల్యూజేఎఫ్ నేతలు ఖదీర్, శ్రీనివాసరెడ్డి, సాగర్

లోకల్ గైడ్ తెలంగాణ,ఖమ్మం:

టీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టులకు చేయూతనిస్తోంది.  వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న జర్నలిస్టులు, జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకుంటోంది. దీనిలో భాగంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వెలుగు దినపత్రిక రిపోర్టర్ తిరుపతిని టీడబ్ల్యూజేఎఫ్ నేతలు తన ఇంటికి వెళ్లి గురువారం పరామర్శించారు. ఇటీవల మృతి చెందిన కామేపల్లి మండలం ముచ్చర్లకు చెందిన జర్నలిస్టు షేక్ రంజాన్ కుటుంబ సభ్యులను కూడా వారి స్వగ్రామానికి వెళ్లి పలుకరించారు.  ఇద్దరు జర్నలిస్టుల కుటుంబాలకు కూడా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 

* జర్నలిస్టుల కుటుంబాలకు వితరణ..
 వైద్య సేవలు పొందుతూ...తన  నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న వెలుగు దినపత్రిక  జర్నలిస్టు తిరుపతిని టీడబ్ల్యూజేఎఫ్ నేతలు పరామర్శించి ఆరోగ్య సమాచారం తెలుసుకున్నారు. అతని హెల్త్ ప్రొఫైల్ ను పరిశీలించి, మెరుగైన వైద్య సేవల విషయంలో  తమ యూనియన్  ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎలాంటి విపత్కర పరిస్థితులున్నా...ఆరోగ్య సమస్యలున్నా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని  టీడబ్ల్యూజేఎఫ్ నేతలు సయ్యద్ ఖదీర్ (వి6), దువ్వా సాగర్ (దిశ), కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి ( నవతెలంగాణ) తిరుపతి కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించి భరోసా ఇచ్చారు.  టీడబ్ల్యూజేఎఫ్ నేతలకు తిరుపతి కృతజ్ఞతలు తెలిపారు. 

* రంజాన్ కుటుంబానికి నిత్యావసరాలు, చిరు ఆర్థిక సహాయం
ఇటీవల కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ అకాల మృతి చెందిన జర్నలిస్టు రంజాన్ కుటుంబానికి టీడబ్ల్యూజేఎఫ్ అండగా ఉంటుందని ఫెడరేషన్ నేతలు హామీ ఇచ్చారు. రంజాన్ భార్య నసీమా, పిల్లలను పరామర్శించారు. కామేపల్లి మండలం ముచ్చర్లకు చెందిన రంజాన్ ఖమ్మంలో ఛానల్ లో విధులు నిర్వహించేవారు.  మూడు నెలల క్రితం ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. ప్రస్తుతం రంజాన్ మాసం కొనసాగుతున్న దృష్ట్యా ఆ కుటుంబం ఇబ్బందులు పడొద్దు అనే ఉద్దేశంతో టీడబ్ల్యూజేఎఫ్ నేతలు ఇంటికి వెళ్లి పరామర్శించారు. నిత్యావసర సరుకులు అందించారు. రంజాన్ పండుగ నేపథ్యంలో కొత్త దుస్తుల కోసం టీడబ్ల్యూజేఎఫ్ నేత ఖదీర్ చిరు ఆర్థిక సహాయం చేశారు. కన్నీరు మున్నీరవుతున్న రంజాన్ కుటుంబాన్ని ఓదార్చారు.  ఎటువంటి సహాయం కావాలన్నా తమను సంప్రదించవచ్చు అని నేతల ఫోన్ నెంబర్లు ఇచ్చారు. యూనియన్లకు అతీతంగా తమ సామాజిక సేవలు ఉంటాయని  ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ నేతలు పేర్కొన్నారు. రంజాన్ ఖమ్మంలో అక్రిడేటెడ్ జర్నలిస్ట్ గా పనిచేసిన దృష్ట్యా ఆయన భౌతికంగా లేకున్నా ఆయన కుటుంబానికి ఖమ్మంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో ప్రాధాన్యత ఇచ్చేలా చూస్తామని టీడబ్ల్యూజేఎఫ్ నేతలు హామీ ఇచ్చారు. ఇరు కుటుంబాలను పరామర్శించిన వారిలో టీడబ్ల్యూజేఎఫ్ బాధ్యులు సయ్యద్ ఖదీర్, దువ్వా సాగర్, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, మానుకొండ రవి కిరణ్( హెచ్ఎంటీవీ), కూరాకుల గోపి( జనం సాక్షి ), వెగినాటి మాధవరావు ( మనమే సాక్ష్యం), షేక్ సుభాన్ ( జనం సాక్షి), కొత్తా యాకేష్( జీ న్యూస్), కొమిరె వెంకటేశ్వర్లు ( వి5), షేక్ జానీ పాషా ( రూలింగ్ వన్),  గరిడేపల్లి వెంకటేశ్వర్లు ( నవతెలంగాణ), తదితరులు ఉన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు   బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు  
సంగారెడ్డి, లోకల్ గైడ్ : సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు రంగురంగుల కలర్స్ ను  న్యాయవాదులు అందరూ...
చెల్పూర్ గ్రామంలో లక్ష్మినర్సింహస్వామి ఉత్సవ విగ్రహాల ప్రతిష్టాపనకు ఏర్పాట్లు 
రంగు రంగుల‌తో కొత్త రేష‌న్ కార్డులు...
వాయిదాల మీద వాయిదాలతో హరిహ‌ర వీర‌మ‌ల్లు....
 వ‌ల వేస్తే చేప‌లు కాదు... కొండ‌చిలువ 
ఆపద్బాంధవుడిగా ఆర్థోపెడిక్ వైద్యులు హర్షవర్ధన్
కేంద్ర ప్రభుత్వం నిదులతో గ్రామ పంచాయతీల అభివృద్ధి