పరిపాలన విధానాలు మార్చుకుంటేనే కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడ

పరిపాలన విధానాలు మార్చుకుంటేనే కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడ

IMG-20241210-WA0028ఏడాది కాంగ్రెస్ పాలనలో కొంత మెరుగుపడినా మరింత మార్పు కోరుతున్న ప్రజలు

గత ప్రభుత్వ విధానాలు నచ్చకే మార్పు కోరిన ప్రజలు

టియుడబ్ల్యుజె రౌండ్ టేబుల్* *సమావేశంలో మేధావులు,

ప్రజా సంఘాల నేతలు.                  

                                          లోకల్ గైడ్. హైదరాబాద్: రాష్టంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలనా పద్ధతులు మార్చుకుంటేనే మనుగడ సాధ్యమవుతుందని పలువురు మేధావులు, ప్రజా సంఘాల నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం విధానాలు నచ్చకనే ప్రజలు రాష్ట్రంలో మార్పు కోరారని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో కొంత మెరుగు పడినా మరింత మార్పును ప్రజలు కోరుతున్నారని వారు స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై పెద్ద తేడా ఆగుపించడం లేదని. వారు అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మంగళవారం, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు 

కె.విరాహత్ అలీ అధ్యక్షతన ప్రజల ఆకాంక్షలు- ఏడాది ప్రభుత్వ పాలన అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఓయు జర్నలిజం విశ్రాంత ప్రొఫెసర్ పద్మజా షా మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన కొంత బాగానే ఉన్నప్పటికీ లగచర్ల, జైనూర్ ఘటనలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసే విదంగా ఉన్నాయని విమర్శించారు. మత కలహాలు సృష్టించే ప్రమాదం ఉందని ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని కోరారు. హాస్టల్స్, గురుకులాలలో విద్యార్థుల మరణాలను పూర్తిగా నిరోధించాలని, పాలనలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆమె స్పష్టం చేశారు. ప్రజా గాయకుడు గేయ రచయిత మాష్టార్టీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకే సామాజిక వర్గ పాలన కొనసాగుతుందని విమర్శించారు. ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి వారితోనే మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. పోన్ ట్యాపింగ్ కేసు కాళేశ్వరం లక్ష కోట్ల నిందితులకు ఎప్పుడు శిక్షలు పడతాయో తెలయదని ప్రస్తుతం దాని ఊసే లేదని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు వేరు కాదని ఒక్కటేనని ధ్వజమెత్తారు. 9 మంది కళాకారులకు 300 గజాల స్థలం కోటి రూపాయలు నగదు ఇస్తానని సిఎం ప్రకటించారని, అయితే లబ్దిదారుల ఎంపిక ఏ ప్రాతిపదికన చేసారో సియం ప్రకటించాలని ఆయన కోరారు. ప్రజల తిరుగుబాటుతోనే అధికార మార్పు వచ్చిందని, కాని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వారి గొయ్యిని వారే తవ్వుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల నిఘా వేదిక రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు డాక్టర్ వి.వి.రావు మాట్లాడుతూ కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడస్తుందని ఆరోపించారు. నేటి రాజకీయాలలో అంతర్గత ప్రజా స్వామ్యం లేదని, చాకలి ఐలమ్మను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. సమాచార హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు. స్థానిక సంస్థలతోనే ప్రజా స్వామ్యం బలపడుతుందని అన్నారు. సామాజిక విశ్లేషకురాలు సజయ మాట్లాడుతూ ఉచిత బస్సు పేరుతో ఆర్టీసి పురుష సిబ్బంది మహిళలను అవమాన పరుస్తున్నారని ఆరోపించారు. మహిళలపై హింస పెరుగుతుందని, దీనిని పూర్తిగా నివారించాలని ఆమె డిమాండ్ చేశారు. సామాజిక విశ్లేషకులు డాక్టర్ పి .వినయ్ కుమార్ మాట్లాడుతూ. పదేళ్ల గత ప్రభుత్వ పాలనలో ప్రజలను పట్టించు కోలేదని ప్రస్తుత ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పాలన సాగించాలని ఆయన కోరారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో లోక్ సత్తా తెలుగు రాష్ట్రాల కో. ఆర్డినేటర్ బండారు రామ్మోహన్ రావు, సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అధ్యకుడు శ్రీనివాస్ రెడ్డి, కోవా సంస్థ అధ్యక్షుడు మజర్ హుస్సేన్, సామాజిక విశ్లేషకులు ముస్తాన్ మాలిక్, విశ్రాంత డీసీపీ ఆర్.ఎస్.ఎన్.బద్రినాధ్, టియుడబ్ల్యుజె ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ, కార్యదర్శి వరకాల యాదగిరి, కోశాధికారి మోతే వెంకట్ రెడ్డి, హెచ్ యుజే అధ్యక్షుడు సిగ శంకర్ గౌడ్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కోశాధికారి ఏ.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి   సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి 
లోక‌ల్ గైడ్: కేబినెట్ నిర్ణయం మేరకు ఈ సంక్రాంతి తర్వాత అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు....
పార్ల‌మెంట్‌లో గంద‌ర‌గోళం
బలగం సినిమా గాయకుడు మొగిలయ్య కన్నుమూత
మేట్టుపాళయం నుంచి ఊటీ మధ్య కొండ రైలు సేవలు ప్రారంభం
ముంబ‌యి సముద్ర తీరంలో ఘోర ప‌డ‌వ ప్ర‌మాదం
సీనియర్ సిటిజన్లందరికీ 'సంజీవని యోజన'
కొండెక్కినా కోడిగుడ్డు ధర