సీనియర్ సిటిజన్లందరికీ 'సంజీవని యోజన'
లోకల్ గైడ్ :
సంజీవిని యోజన' కింద సీనియర్ సిటిజన్లకు ఎంత ఖర్చయినా ఉచిత వైద్యం అందిస్తామని, ఖర్చుకు పరిమితంటూ లేదని కేజ్రీవాల్ తెలిపారు.. ఇందుకోసం ఒకటి రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ మొదలవుతుందని తెలిపారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కీలక ప్రకటన చేసింది. సీనియర్ సిటిజన్లు అందరికీ ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత వైద్య చికిత్స అందిస్తామని పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvnind Kejriwal తెలిపారు. తమ పార్టీ తిరిగి అధికారంలోకి రాగానే 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లందరికీ 'సంజీవని యోజన' (Sanjeevani Yojana) కింద ఉచిత వైద్య చికిత్సలు అందిస్తామని తెలిపారు. ''ప్రజల బాగోగులు చూడాల్సిన బాధ్యత మాకు ఉంది. దేశాన్ని ముందుకు తీసుకు వెళ్లడంలో మీరంతా ఎంతో కష్టపడుతున్నారు'' అని కేజ్రీవాల్ తెలిపారు.
Comment List