పార్ల‌మెంట్‌లో గంద‌ర‌గోళం

ఎంపీల‌కు గాయ‌లు

లోకల్ గైడ్ :పార్ల‌మెంట్‌లో గంద‌ర‌గోళం నెల‌కొన్న‌ది. అంబేద్క‌ర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ.. ఇవాళ పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో కాంగ్రెస్ ఎంపీలు నిర‌స‌న చేప‌ట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీని వ్య‌తిరేకిస్తూ.. బీజేపీ ఎంపీBJP MP Pratap Sarangi.jpg ఆందోళ‌న చేప‌ట్టారు. పార్ల‌మెంట్‌లోని మ‌క‌ర ద్వారం వ‌ద్ద .. ఇండియా కూట‌మి, బీజేపీ ఎంపీలు ఎదురుప‌డ్డారు. దీంతో అక్క‌డ తోపులాట జ‌రిగింది. ఆ ఘ‌ర్ష‌ణ‌లో బీజేపీ ఎంపీలు ప్ర‌తాప్ సారంగి, ముకేశ్ రాజ్‌పుత్ గాయ‌ప‌డ్డారు.బీజేపీ ఎంపీలు త‌న‌ను నెట్టివేశార‌ని, పార్ల‌మెంట్ లోప‌లికి వెళ్ల‌కుండా అడ్డుకున్నార‌ని రాహుల్ గాంధీ ఆరోపించారు. కానీ రాహుల్ గాంధీ తోయ‌డం వ‌ల్లే ఎంపీల‌కు గాయ‌మైన‌ట్లు పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు తెలిపారు. తీవ్రంగా గాయ‌ప‌డ్డ ఎంపీ ముకేశ్ రాజ్‌పుత్‌ను ఆస్ప‌త్రిలో చేర్పించారు.రాహుల్‌గాంధీ ఓ ఎంపీని నెట్టేశార‌ని, ఆ ఎంపీ త‌న‌పై ప‌డిపోయార‌ని, దాంతో తాను కింద ప‌డిపోయిన‌ట్లు బీజేపీ ఎంపీ ప్ర‌తాప్ చంద్ర సారంగీ తెలిపారు. రాహుల్ గాంధీ ఎంపీని తోసివేసిన స‌మ‌యంలో తాను మెట్ల వ‌ద్ద నిలుచుకున్న‌ట్లు తెలిపారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి   సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి 
లోక‌ల్ గైడ్: కేబినెట్ నిర్ణయం మేరకు ఈ సంక్రాంతి తర్వాత అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు....
పార్ల‌మెంట్‌లో గంద‌ర‌గోళం
బలగం సినిమా గాయకుడు మొగిలయ్య కన్నుమూత
మేట్టుపాళయం నుంచి ఊటీ మధ్య కొండ రైలు సేవలు ప్రారంభం
ముంబ‌యి సముద్ర తీరంలో ఘోర ప‌డ‌వ ప్ర‌మాదం
సీనియర్ సిటిజన్లందరికీ 'సంజీవని యోజన'
కొండెక్కినా కోడిగుడ్డు ధర