ముంబ‌యి సముద్ర తీరంలో ఘోర ప‌డ‌వ ప్ర‌మాదం

13 మంది మృతి..

లోకల్ గైడ్:Mumbai-boat-accident_V_jpg--816x480-4g ముంబై (Mumbai) తీరంలో జరిగిన ఘోర పడవ ప్రమాదం (Boat accident) లో మృతుల సంఖ్య 13కు పెరిగింది. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 114 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో 101 మంది నేవీ, కోస్ట్‌ గార్డు సిబ్బంది రక్షించారు. మరణించిన 13 మందిలో 10 మంది పౌరులు, ముగ్గురు నేవీ అధికారులు ఉన్నారు.

నేవీకి చెందిన ఓ స్పీడ్ బోట్‌ అదుపుతప్పి నీల్‌కమల్‌ ప్యాసింజర్‌ వెజెల్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పడవ గేట్‌ వే ఆఫ్‌ ఇండియా నుంచి ఎలిఫెంటా ద్వీపానికి వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్‌ కోస్ట్‌గార్డ్స్‌ (Indian coast guards), నేవీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. మొత్తం 101 మందిని రక్షించారు. మిగతా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలతో బయటపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారు నేవీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌ కోసం 11 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 4 హెలిక్యాప్టర్‌లను వినియోగించినట్లు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ తెలిపారు.మృతుల కుటుంబాలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఘటనపై పోలీసులు, నేవీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి   సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి 
లోక‌ల్ గైడ్: కేబినెట్ నిర్ణయం మేరకు ఈ సంక్రాంతి తర్వాత అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు....
పార్ల‌మెంట్‌లో గంద‌ర‌గోళం
బలగం సినిమా గాయకుడు మొగిలయ్య కన్నుమూత
మేట్టుపాళయం నుంచి ఊటీ మధ్య కొండ రైలు సేవలు ప్రారంభం
ముంబ‌యి సముద్ర తీరంలో ఘోర ప‌డ‌వ ప్ర‌మాదం
సీనియర్ సిటిజన్లందరికీ 'సంజీవని యోజన'
కొండెక్కినా కోడిగుడ్డు ధర