ఇస్తేమ కార్యక్రమం విజయవంతంగా జరిగేలా కృషి
జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
By Ram Reddy
On
లోకల్ గైడ్ :రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలో జనవరి 4,5 తేదీలలో నిర్వహించే ఇస్తేమ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు.
శంకర్ పల్లిలో జనవరి 4,5 తేదీలలో నిర్వహించే ఇస్తేమ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ముస్లిం మత పెద్దలు, అధికారులతో కలిసి మంగళవారం జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు, మత పెద్దలు సమన్వయంతో పని చేస్తూ ఇస్తేమ కార్యక్రమం విజయవంతంగా జరిగేలా కృషి చేయాలన్నారు. ఇస్తేమా కార్యక్రమానికి లక్షలాది మంది హాజరు అవుతున్న నేపథ్యంలో డివైడర్లతో కూడిన విస్తీర్ణమైన రోడ్లను ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా పార్కింగ్ స్థలాలను గుర్తించాలని పోలీస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇస్తేమా కార్యక్రమం విజయవంతం దిశగా అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. మంచి నీరు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులకు కలెక్టర్ తెలిపారు. విద్యుత్తు అంతరాయం లేకుండా తగినన్ని ట్రాన్స్ఫార్మర్లను, పోల్స్, వైరింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. తగినన్ని మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య పనుల విషయంలో పెద్ద మొత్తంలో సిబ్బందిని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని శంకర్ పల్లి మున్సిపల్ కమిషనర్ కు సూచించారు. లైటింగ్ కూడా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతిరోజు సంబంధిత అధికారులు తమకు నిర్దేశించిన పనులను పర్యవేక్షిస్తూ వేగవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో చేవెళ్ళ శాసన సభ్యులు కాలే యాదయ్య, తెలంగాణ మైనారిటీల రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ (TGMREIS) వైస్ చైర్మన్ & ప్రెసిడెంట్ మహ్మద్ ఫహీముద్దీన్ ఖురేషీ, ఆర్డీవో చంద్రకళ, డిఎండబ్ల్యుఓ నవీన్ రెడ్డి, డిపిఓ సురేష్ మోహన్, ఈఈ ఆర్.డబ్ల్యూఎస్ రాజేశ్వర్, మిషన్ భగీరథ అధికారులు, తహసిల్దార్ సురేందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, ముస్లిం మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
19 Dec 2024 15:30:19
లోకల్ గైడ్: కేబినెట్ నిర్ణయం మేరకు ఈ సంక్రాంతి తర్వాత అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు....
Comment List