సీఎం రేవంత్, ఎమ్మెల్యే అనిరుద్ నాయకత్వంలో రైతన్నలకు న్యాయం..
కాంగ్రెస్ పార్టీ రాజాపూర్ గ్రామ అధ్యక్షుడు గోనెల రమేష్ పాలమూరు గడ్డన రైతు పండగకు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా రైతుల తరలింపు
By Ram Reddy
On
రాజపూర్ లోకల్ గైడ్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి నాయకత్వంలో రైతన్నలకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని రాజపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు గోనెల రమేష్ అభిప్రాయపడ్డారు.
ఒక్క ఏడాదిలో 54 వేల కోట్ల రూపాయలతో రైతుల జీవితాల్లో పండగ తెచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, పాలమూరులో జరిగే రైతు పండుగ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతన్నలకు స్పష్టమైన భరోసా కల్పిస్తారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాకు వస్తున్న సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ శ్రేణులు పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు వందలాదిగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పాలమూరుకు తరలి వెళ్లారని పేర్కొన్నారు. అన్నదాతలతో కలిసి, రైతు పండుగలో పాలు పంచుకోవడానికి ఉమ్మడి పాలమూరుకు వస్తున్నారని, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి నాయకత్వంలో రైతన్నలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పాలమూరు జిల్లాలోని రైతు పండగ జరుగుతుండడం గొప్ప శుభ పరిణామమని గోనెల రమేష్ అన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
19 Dec 2024 15:30:19
లోకల్ గైడ్: కేబినెట్ నిర్ణయం మేరకు ఈ సంక్రాంతి తర్వాత అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు....
Comment List