వెయ్యి పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..!
లోకల్ గైడ్:
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. వెయ్యి పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..! Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. గత సెషన్‌లో సూచీలు పహల్గాంలో ఉగ్రవాదుల దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తల కారణంగా మార్కెట్లు పతనమయ్యాయి. అయితే, వారంలో తొలిరోజైన సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. గత సెషన్‌లో సూచీలు పహల్గాంలో ఉగ్రవాదుల దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తల కారణంగా మార్కెట్లు పతనమయ్యాయి. అయితే, వారంలో తొలిరోజైన సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. విదేశీ పెట్టుబడులు కొనసాగడం.. బ్లూ చిప్ స్టాక్స్ రాణించడంతో మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ సెన్సెక్స్ 79,343.63 పాయింట్ల లాభాల్లో మొదలైంది. ఏ దశలోనూ మళ్లీ వెనక్కి తగ్గకుండా వరుస సెషన్లలో లాభాల్లో ట్రేడయ్యింది. ఈ క్రమంలో సెన్సెక్స్ 80,321.88 పాయింట్ల గరిష్ఠానికి చేరింది. చివరకు 1,005.84 పాయింట్ల లాభంతో 80,218.37 వద్ద స్థిరపడింది.నిఫ్టీ 272.90 పాయింట్లు పెరిగి.. 24,312.25 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో దాదాపు 1,877 షేర్లు లాభపడ్డాయి. మరో 1,961 షేర్లు పతనయ్యాయి. నిఫ్టీలో అత్యధికంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ లైఫ్, భారత్ ఎలక్ట్రానిక్స్, సన్ ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ అత్యధికంగా లాభపడ్డాయి. శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎటర్నల్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌యూఎల్ నష్టపోయాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.3 శాతం పెరిగింది. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం పెరిగింది. ఐటీ మినహా మిగతా అన్ని రంగాల సూచీలు మెటల్, రియాల్టీ, ఆయిల్, గ్యాస్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్ ఒకటి నుంచి 3శాతం పెరిగాయి.
Comment List