ప్రియదర్శి మరో హిట్ కొడతాడా? సారంగపాణి జాతకం!
లోకల్ గైడ్:
టాలీవుడ్లో ఈ మధ్య కామెడీ సినిమాలకు మంచి డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే. ఇటీవల వచ్చిన టిల్లు, టిల్లు స్క్వేర్, మ్యాడ్ చిత్రాలు ప్రేక్షకులకు నవ్వులనుపంచాయి.టాలీవుడ్లో ఈ మధ్య కామెడీ సినిమాలకు మంచి డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే. ఇటీవల వచ్చిన టిల్లు, టిల్లు స్క్వేర్, మ్యాడ్ చిత్రాలు ప్రేక్షకులకు నవ్వులనుపంచాయి. అయతే ఇదే కోవలో నవ్వించడానికి తెలుగు నుంచి మరో సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. ఈ సినిమాకు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించగా.. రూప కొడువాయూర్ కథానాయికగా నటించింది. శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది. కోర్ట్ తర్వాత ప్రియదర్శి మళ్లీ హిట్టు అందుకున్నాడా అనేది రివ్యూలో చూద్దాం.ప్రముఖ కార్ల కంపెనీలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తుంటాడు సారంగపాణి (ప్రియదర్శి). తన పనితనంతో రెండేండ్ల నుంచి బెస్ట్ ఎంప్లాయ్‌గా కొనసాగుతుంటాడు. అయితే అదే కార్ల కంపెనీలో మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుంటుంది మైథిలీ (రూప కొడువాయూర్). మైథిలీ అంటే సారంగపాణికి చాలా ఇష్టం. ఇదే విషయాన్ని తనకు చెబుదామనుకుంటాడు. కానీ పాణికి చిన్ననాటి నుంచి జ్యోతిష్యం మీదా నమ్మకం ఎక్కువ.. తన లైఫ్‌లో ఏం పనిచేసిన గ్రహాలు అనుకులంగా ఉన్నాయా అని చూసుకొని పని మొదలుపెడతాడు. దీంతో మైథిలీతో ప్రేమ విషయం కూడా మంచి ముహూర్తం చూసి చెప్పాలనుకుంటాడు. అయితే మైథిలీ మాత్రం నమ్మకాల్ని పట్టించుకోని ఆధునిక భావాలతో పెరిగిన ఒక యువతి. పాణి ముహూర్తం చూసి చెప్పాలి అనుకునే గ్యాప్‌లో మైథిలీ వచ్చి పాణికి ప్రపోజ్ చేసేస్తుంది. దీంతో వారి ప్రేమ కథ సంతోషంగా సాగుతూ పెళ్లి వరకు వెళుతుంది.ఈ క్రమంలోనే సారంగపాణి ఒకరోజు పబ్‌లో ఉండగా.. అతడిని జిగేశ్వరానంద (అవసరాల శ్రీనివాస్) అనే ఒక హస్తసాముద్రికుడు(Palmist) చూసి అతడి చేతిని పరిశీలించి భవిష్యత్తులో ఒక హత్య చేస్తాడని జోస్యం చెబుతాడు. జాతకాలను గట్టిగా నమ్మే పాణి జిగేశ్వరానంద చెప్పింది విని ఆందోళన చెందుతాడు. మర్డర్ చేస్తాను అనే భయంతో తన పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటాడు. అయితే తన జాతకంలో హత్య చేయాలి అని పక్కరాసి ఉంది కాబట్టి ఆ హత్య ఏదో పెళ్లికి ముందు చేసేసి లైఫ్‌లో సెటిల్ అయిపోదాం అనుకుంటాడు పాణి. ఈ క్రమంలోనే తన చిన్ననాటి స్నేహితుడు అయిన చందు (వెన్నెల కిశోర్) సాయం కోరతాడు. అయితే సారంగపాణి, చందూ కలిసి హత్య చేయాలనుకుంటున్న వ్యక్తి ఎవరు. పాణి, చందూ కలిసి ఆ హత్య చేశారా. ఈ జిగేశ్వరానంద ఎవరు.. అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Comment List