భూ భారతి చట్టం నిజంగా రైతులకు చుట్టం
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కొండూరు జై వీర్ రెడ్డి.
లోకల్ గైడ్ :
భూ భారతి చట్టం నిజంగా రైతులకు చుట్టమని నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జై వీర్ రెడ్డి అన్నారు.తెలంగాణ భూభారతి చట్టం (భూముల హక్కుల రికార్డు -2025) పై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా శనివారం నల్గొండ జిల్లా ,పెద్దవూర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన వాగ్దానం మేరకు ధరణి స్థానంలో భూభారతి వంటి మంచి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని, రైతులందరూ భూభారతి చట్టాన్ని పెద్ద మనసుతో స్వీకరించాలని, ఈ చట్టం ద్వారా రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ,ధరణిలో ఉన్న సమస్యలన్నీటికి పరిష్కారం భూ భారతి ద్వారా లభిస్తుందన్నారు. అధికారులు భూ భారతి చట్టంపై రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. ధరణి వల్ల రైతుల ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వాటిని పరిష్కరించే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని నాలుగు మండలాలలో పైలెట్ ప్రాజెక్టు కింద భూ భారతిని అమలు చేయడం జరిగిందని, అందులో మొట్టమొదటి మండలం నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి సాగర్ అని తెలిపారు. ఈ చట్టం ద్వారా భూ సమస్యలను పరిష్కరించేందుకు మంచి అవకాశం కలిగిందని, రైతులకు సంబంధించిన భూ సమస్యలను పరిష్కరించడంలో తాము ఎప్పుడు ముందుంటామని తెలిపారు.జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ భూ భారతి లో ప్రతి సంవత్సరం రికార్డులను అప్డేట్ చేయడం జరుగుతుందని, భూములకు హాద్దులను నిర్ణయించేందుకు సర్వేయర్ల ద్వారా జియో కో-ఆర్డినేట్ ఏర్పాటు చేసే వెసులుబాటు చట్టంలో ఉందని, భూ భారతిలో భూములకు సంబంధించిన అన్ని వివరాలను ఆన్లైన్ రికార్డు చేయడం జరుగుతుందని, ఈ ఆన్లైన్ రికార్డర్ శాశ్వతంగా పనికొస్తుంది తెలిపారు.భూములను సర్వే చేసేందుకు గతంలో రైతులు, అధికారులు తహశీల్దార్లు చాలా ఇబ్బందులు పడేవారని,భూ భారతి ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే లైసెన్స్డ్ సర్వేయర్ పద్ధతిని తీసుకురానున్నదని తెలిపారు.భూ సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, అందుకే భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని, రైతులందరూ ఈ చట్టం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. గతంలో మాదిరి భూముల సమస్యల పరిష్కారానికి రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, గతంలో ధరణిలో సాంకేతిక సమస్యలు, సర్వర్ డౌన్ సమస్యలు ఉండేవని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. ధరణిలో 4000 కు పైగా కోర్రి టేబుల్స్ ఉందేవని ,ఇప్పుడు భూ భారతిలో కేవలం 6 మాడ్యూల్స్ మాత్రమే ఏర్పాటు చేయడం జరిగిందని,ఇప్పటివరకు 2020 అక్టోబర్ వరకు ఉన్న సాదా బైనామాల పై ఆప్పీలు పద్ధతి ఉండేది కాదని, ఇప్పుడు భూ భారతిలో ఆర్డీవోకు అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు.అంతేకాక చట్టంపై అన్ని విభాగాలు, నియమ, నిబంధనలను పూర్తిస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ బ్ అమిత్ మాట్లాడుతూ ధరణి ద్వారా ప్రజలకు మేలు చేసే అవకాశం అధికారులకు కూడా ఉండేది కాదని, అలాంటిది భూ భారతి వల్ల రైతులకు మేలు చేసేందుకు వెసులపాటు ఉందని అన్నారు. చట్టం లోని ముఖ్యమైన అంశాలను ఆయన రైతులకు వివరించారు .విభాగాలను వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి కృష్ణారెడ్డి, మాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్ర శేఖర్ రెడ్డి ,లింగారెడ్డి తదితరులు భూ భారతి చట్టం పై మాట్లాడారు.పెద్ద ఊర తహసీల్దార్ శ్రీనివాస్ సదస్సుకు అధ్యక్షత వహిస్తూ చట్టంలోని ముఖ్యమైన అంశాలను వివరించారు.
Comment List