రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే వరి ధాన్యాన్ని విక్రయించాలి
రైతులకు ఏ సమస్య వచ్చినా 8096107107 కు ఫోన్ చేయండి
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
లోకల్ గైడ్ తెలంగాణ :
పర్వతగిరి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ నందు నవచైతన్య గ్రామేక్య ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమని తెలిపారు. అందుకోసమే రాష్ట్రంలో సన్నాలు పండించే రైతులను ప్రోత్సహస్తుందని అన్నారు. వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా కొనుగోలు కేంద్రాల వద్ద నిర్వాహకులు టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని సూచించారు.ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక ఏడాదిన్నర కాలంలోనే అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ మహిళలకు పెద్ద పీట వేస్తూ ముందుకు వెళ్తున్న గొప్ప ప్రజా ప్రభుత్వం అన్నారు.రైతులు ప్రభుత్వ నిర్వహించే కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. రైతులు పండించిన ప్రతీ గింజనూ కొంటామని తెలిపారు. సన్నరకం వడ్లకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని, రైతులకు ఏ ఇబ్బంది ఉన్నా నా డయల్ యువర్ ఎమ్మెల్యే 8096107107 కాల్ చేసి నా దృష్టికి తీసుకురావాలన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ గొడుగు బిక్షపతి,మండల పార్టీ అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్ నాయక్, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు బానోతు భాస్కర్ నాయక్, మండల మహిళా అధ్యక్షురాలు మాసాని సువార్త, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొడుగు వినయ్, మాజీ ఎంపీటీసీ బోట్ల మహేంద్ర మండల, గ్రామ, స్థాయి నాయకులు, కార్యకర్తలు,రైతులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comment List