R&R సెంటర్ కు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని మంత్రికి వినతి
లోకల్ గైడ్:
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామంలోని R&R సెంటర్ కు ప్రత్యేక ప్యాకేజీ కింద ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని గట్టు మాజీ ఎంపీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వినతి పత్రం ఇచ్చారు. శనివారం ధరూరు మండల కేంద్రంలో జరిగిన భూభారతి 2025 చట్టంఅవగాహన సదస్సుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. 2006 లో అప్పటి ప్రభుత్వం చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా నెట్టెంపాడు ప్రాజెక్టులో ముంపునకు గురైనదన్నారు. 2024 ఆగస్టులో వచ్చిన భారీ వర్షాలకు గ్రామం నీటిలో ముప్పున గురైనదని, గ్రామంలోకి నీరు వచ్చి చేరడంతో నిర్వాసితులమైన మేము తలో దిక్కు వెళ్లి ప్రభుత్వం ఏర్పాటు చేసిన R&R సెంటర్ కు వెళ్లి అక్కడ గుడిసెలు వేసుకుని జీవనాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. రిజర్వాయర్ లో ఇండ్లు పొలాలను సర్వం కోల్పోయినా మాకు 360 పట్టా సర్టిఫికెట్లు ప్రభుత్వం పంపిణీ చేసినదన్నారు. మీరు మాపై దయవుంచి ప్రత్యేక ప్యాకేజీ కింద 360 ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో మాజీ ఎంపీపీ విజయకుమార్, గ్రామ పెద్దలు శ్రీనివాసులు నర్సింలు, జయరాం గౌడ్, డీలర్ వెంకటేష్, తిమ్మారెడ్డి, వెంకటేష్ గౌడ్, గోయికల చిన్న వెంకటేష్, తదితరులు ఉన్నారు
Comment List