సూర్యాకే డీసీసీ కిరీటమా?
లోకల్ గైడ్
ములుగు జిల్లా అధ్యక్ష పీఠం పై కూర్చునేదెవరు? ఈ ప్రశ్న కాంగ్రెస్ వర్గాల్లోనే కాకుండా? ములుగు జిల్లా
ప్రజల్లో కూడా తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సమర్ధుడెవరు? పాత వ్యక్తినే కొనసాగించాలా? యువకెరటాన్ని రంగంలో దించాలా? అధిష్టానం ఆలోచనలో ఉంది ఈ సందర్భంలో ములుగు జిల్లా ప్రజానీకం, కాంగ్రెస్ క్యాడర్ మాత్రం యువకుడు, యువజన కాంగ్రెస్ లో చురుకైన పాత్ర పోషిస్తున్న సూర్యకే జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని పట్టం కట్టాలని కోరుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పినపాక నుండి టిక్కెట్ దక్కక పోయినా ఆధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ బలోపేతం కోసం, పార్టీ గెలుపు కోసం కృషి చేసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అంతే కాకుండా ములుగు, పినపాక నియోజకవర్గాలలో పార్టీ గెలుపు కోసం క్రీయాశీలక పాత్ర పోషించారు. పార్టీలో కార్యకర్తలను సమన్వయం చేస్తూ, యువతను ప్రోత్సహిస్తూ ముందుకు సాగారు. అంతటితో ఆగకుండా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా పార్టీ క్యాడర్‌ను ఏ మాత్రం సడలిపోకుండా ఉండే విధంగా తన వంతు బాధ్యతగా పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల ప్రచారం యువతను తన వెంట పెట్టుకొని పార్టీ బలోపేతం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి సీతక్క ప్రభుత్వ పనుల్లో బిజీబిజీగా ఉండడంతో, ములుగు నియోజకవర్గంలో ఎక్కువగా గిరిజనులు, బలహీనవర్గాల ప్రజలు ఉన్నారని, వారికి ప్రజాప్రతినిధిలోటు లేకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సీతక్క కుమారుడు సూర్య అటు ప్రజలకు, ఇటు పార్టీ కార్యకర్తలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ, పార్టీ కార్యకర్తలకు దిశానిర్ధేశం చేస్తూ, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ యువతకు అవసరమైన అన్ని విధాలుగా ప్రోత్సాహించారు.
ఈ క్రమంలో ములుగు జిల్లా ప్రజలు, పార్టీ కార్యకర్తలు అందరూ ముక్త కంఠంతో జిల్లా అధ్యక్ష పదవికి అన్ని రకాలుగా సూర్యనే సరైనోడని మరో వర్గం చర్చించుకుంటున్నారని వినికిడి. యువత మాత్రం ఎంపిక నామ మాత్రమే ఆల్మోస్ట్ సూర్య పేరు ఖరారు అయినట్లేనన్న విషయం బహటంగానే చర్చించుకుంటున్నారు. పైడాకుల అశోక్ ఇప్పటికే ఈ పదవిలో కొనసాగుతుండగా, యువకుడైన సూర్యకు ఒక్క చాన్స్ ఇస్తే జిల్లాలో కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని యువత, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
గిరిజనుల అభివృద్ది కోసం పోరాటం చేసి అమరుడైన తండ్రి కుంజ రాము ఆశయాలు, తల్లి సీతక్క రాజకీయ వారసత్వాన్ని పునికి పుచ్చుకుని అటు జనంలోనూ, ఇటు పార్టీలోనూ చురుకుగా పనిచేస్తోన్న సూర్య యువతకు ఆదర్శంగా నిలుస్తూ.. పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తాడని ప్రజలు చర్చించుకుంటున్నారు. అంతా సజావుగా జరిగి సూర్యకు జిల్లా అధ్యక్ష పదవి దక్కితే యువకు న్యాయం జరుగుతుందని పార్టీలోని యువత, పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నారు.ఏది ఏమైనప్పటికీ ఈ పాటికే సూర్య క్రియాశీలక రాజకీయాల్లో కీలక రోల్ పోషించడంతో ములుగు జిల్లాతో పాటు రాష్ట్ర యువతలో కూడా ములుగు డీసీసీ అధ్యక్ష పదవి చర్చనీయంశంగా మారింది. రాజకీయ సమీకరణలు, సర్ధుబాట్లలో భాగంగా 2023లో జరిగిన ఎన్నికల్లో పినపాక నియోజకవర్గం నుండి ఆయన పోటీ సాధ్యం కాలేదు.
ఒక ఆదివాసీ మహిళ అయిన ధనసరి సీతక్క రాష్ట్ర రాజకీయాల్లో ఎంతటి పాత్ర పోషిస్తోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచాన్ని అతలా కుతలం చేసిన కరోనా మహమ్మారి విళయతాండవం చేసిన రోజుల్లో కూడా కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, ఎడారులా? మనకడ్డంకి...పదండి ముందుకు..పదండి తోసుకు పోదాం..పోదాం పైపైకి అంటూ తాను ఆదివాసీ ప్రజలకు చేసిన సేవ, ప్రాంతాలు కాదు ప్రజలే ముఖ్యమని ఒక్క ములుగు ప్రజలే కాకుండా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల తారతమ్యం లేకుండా సేవలు చేశారు. సీతక్క చేసిన సేవలకు తెలుగు ప్రజలందరూ చాలా ఆనందం వ్యక్తం చేశారు. అలాంటి తల్లి నెత్తురు పంచుకు పుట్టిన సూర్య కూడా తన వంతుగా గిరిజన ప్రాంత్తాల్లో మెడికల్ క్యాంపులు, స్వచ్ఛంద సేవలు ప్రజలకు అందించి సూపరిచితుడైనారు.
సూర్య చిన్నతనంలోనే తండ్రి కుంజ రాము గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేసి అమరుడైనారు. తల్లి ప్రభుత్వంలో మంత్రిగా ప్రజా సేవకు అంకిత భావంతో పని చేస్తున్నారు. తనయుడు తన వంతుగా ప్రజలకు సేవలందిస్తూన్నారు. ఇలాంటి తరుణంలో సూర్యకు డీసీసీ పదవిని అప్పగిస్తే ప్రజాసేవలో గానీ, జిల్లాలో పార్టీని బలోపేతం చెయ్యడంలో గాని తల్లి కంటే? గొప్పగా పని చేస్తాడని, కాంగ్రెస్ యువజన విభాగం భావిస్తోంది. సూర్యతో పాటు మరి కొందరి పేర్లు వినిపిస్తున్నా కూడా...' డీసీసీగా సూర్యనే మాకు ముద్దు- ఇంకెవరూ మాకొద్దు'
అనే నినాదాలు సైతం యువతలో బలంగా వినిపిస్తున్నాయి. సూర్య అంటే సాయం, సూర్య అంటే స్నేహం, సూర్య అంటే సేవ అనేంతగా సూర్య ప్రజల్లో పేరు సంపాదించుకున్న తీరు చూస్తే డీసీసీ పదవి తనకు వరించడమే న్యాయం అనే మాటలు సైతం బహిరంగంగా వినబడుతున్నాయి. సూర్య మాత్రం పదవుల కంటే కూడా పార్టీ ప్రతిష్ట, పటిష్టత కోసం అహర్నిసలు శ్రమిస్తానని చెప్పడం కొసమెరుపు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల మద్ధతున్న సూర్యకే పార్టీ అధిష్టానం పట్టం కడుతుందా? లేక తన అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటుందా? అనేది వేచి చూడాల్సిందే.
Comment List