వేసవిలో మంచినీటిని ఉచితంగా అందిస్తున్న  వాసవి మా ఇల్లు సంస్థ

వేసవిలో మంచినీటిని ఉచితంగా అందిస్తున్న  వాసవి మా ఇల్లు సంస్థ

లోకల్ గైడ్:

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వాసవి మా ఇల్లు సంస్థ  రెండు ట్యాంకర్ల ద్వారా ప్రజలకు 100 రోజులపాటు ఉచితంగా త్రాగునీటిని అందించడం అభినందనీయమని జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్  మహేశ్వర శర్మ సిద్ధాంతి అన్నారు. వాసవి మా ఇల్లు సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన రెండు మంచినీటి ట్యాంకర్లను ఫసల్వాదిలోని ఆశ్రమంలో మంగళవారం పూజలు చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గతంలో వీధి వ్యాపారులకు పెద్ద గొడుగులను, విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లను పంపిణీ చేశారని చెప్పారు. వ్యవస్థాపకులు తోపాజి అనంత కిషన్ మాట్లాడుతూ వాసవి మా ఇల్లు ద్వారా 18 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలను చేస్తున్నట్లు చెప్పారు. వరుసగా రెండో సంవత్సరం కూడా వేసవిలో ప్రజలకు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీధర్, నీహార్ హాస్పిటల్స్ రాజు, పుల్లూరి ప్రకాష్,ఆమేటి మహేందర్, జూలకంటి బుచ్చిలింగం, మ్యాడం రాధకిషన్,  నామా భాస్కర్,కొత్త రవీందర్,అనుముల సంతోష్, చంద్రిక కరుణాకర్, సరాఫ్ భూకుమార్,మిరియాల పీతాంబర్,ఏం. గోపాల్ రెడ్డి, గుండ్లపల్లి నరేష్ కుమార్ , సుధాకర్, గంగేరి శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..
లోక‌ల్ గైడ్: జైపూర్‌ నుంచి ముంబైకి బయలుదేరిన 6E 5324 నెంబర్‌ ఇండిగో విమానం టాయిలెట్స్‌లో లభ్యమైన ఓ లేఖ తీవ్ర కలకలం రేపింది. విమానంలో బాంబుపెట్టామని...
రాబోయ్ మూడు గంటల్లో ఆ మూడు జిల్లాల్లో పిడుగుల వాన
అవ‌తార్‌ని మించి అట్లీ
టాస్‌ గెలిచిన కోల్‌కతా..
నాంపల్లిలో పుస్తక ప్రదర్శన..
ఆ ఒక్క సీన్ కోసమే రాజ‌మౌళి వంద కోట్లు ఖ‌ర్చు పెడుతున్నాడా..!
 బెదిరిస్తే.. బెదురుతామా ఏందీ..?