ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు

ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు

లోకల్ గైడ్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో మూడు రోజులు పాటు రాయలసీమ మరియు కోస్తా ఆంధ్ర ప్రాంతాలలో భారి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక మరోవైపు నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా మండిపోయాయి. దీంతో ప్రజలు బయటకు రావడానికి చాలా భయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా చాగలమర్రిలో అత్యధికంగా నిన్న 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు కర్నూలు జిల్లా కోసగిలో 40.6 డిగ్రీలు నమోదయిందని, అలాగే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 28 మండలాల్లో తీవ్రమైన వడగాలులు  వీచాయని తెలిపింది. దీంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు తిరగొద్దని అధికారులు సూచిస్తున్నారు. అయితే ఇప్పటికే భూగర్భ జలాల్లో నీరు లేవని.. పంట చేతికి వచ్చే సమయంలో పైరు ఎండిపోతుందని  అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. 

images (23)

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News