ఐపీఎల్‌లో తిరుగులేని రికార్డులు..

ఐపీఎల్‌లో తిరుగులేని రికార్డులు..

లోకల్ గైడ్:

ఆరో టైటిల్‌పై గురి శనివారం నుంచి ప్రారంభం కాబోయే ఐపీఎల్‌లో ఇది 18వ సీజన్‌. గడిచిన 17 సీజన్లలో తాము ఆడిన 15 సీజన్ల (2016, 2017లో రెండేండ్లు నిషేధం)లో ఐదు ట్రోఫీలు గెలవడం ఒకెత్తు అయితే ఈ టోర్నీలో ఏకంగా పదిసార్లు ఫైనల్‌ ఆడిన జట్టు ఏదైనా ఉందా? అంటే అది చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాత్రమే. 2010, 2011, 2018, 2021, 2023లో టైటిళ్లు సాధించిన సీఎస్‌కే.. 2008, 2012, 2013, 2015, 2019లో రన్నరప్‌గా నిలిచింది.చెన్నై సూపర్‌ కింగ్స్‌.శనివారం నుంచి ప్రారంభం కాబోయే ఐపీఎల్‌లో ఇది 18వ సీజన్‌. గడిచిన 17 సీజన్లలో తాము ఆడిన 15 సీజన్ల (2016, 2017లో రెండేండ్లు నిషేధం)లో ఐదు ట్రోఫీలు గెలవడం ఒకెత్తు అయితే ఈ టోర్నీలో ఏకంగా పదిసార్లు ఫైనల్‌ ఆడిన జట్టు ఏదైనా ఉందా? అంటే అది చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాత్రమే. 2010, 2011, 2018, 2021, 2023లో టైటిళ్లు సాధించిన సీఎస్‌కే.. 2008, 2012, 2013, 2015, 2019లో రన్నరప్‌గా నిలిచింది. ఆడిన 15 సీజన్లలో 2020, 2022, 2024లో మినహాయిస్తే ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు వెళ్లకుండా సీజన్‌ను ముగించలేదంటే ఆ జట్టు ఎంత నిలకడగా ఆడుతుందో అర్థం చేసుకోవచ్చు.భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన దిగ్గజ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ సారథ్యంలో టోర్నీలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా రికార్డులకెక్కిన చెన్నై..గత సీజన్‌లో కొత్త సారథి రుతురాజ్‌ గైక్వాడ్‌ కెప్టెన్సీలో విఫలమైంది. నిరుటి సీజన్‌లో విఫలమైనప్పటికీ 2025లో మాత్రం సత్తా చాటి ఆరో టైటిల్‌ను దక్కించుకోవాలని సీఎస్‌కే పట్టుదలతో ఉంది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News