మేట్టుపాళయం నుంచి ఊటీ మధ్య కొండ రైలు సేవలు ప్రారంభం

లోకల్ గైడ్:nani3_02050892a2_v_jpg

మేట్టుపాళయం-ఊటీ(Mettupalayam-Ooty) మధ్య కొండ రైలు సేవలు ఐదు రోజుల అనంతరం మళ్లీ ప్రారంభమయ్యాయి. కోయంబత్తూర్‌(Coimbatore) జిల్లా మేట్టుపాళయం నుంచి నీలగిరి జిల్లా ఊటీ మధ్య కొండ రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. వర్షాకాలంలో అటవీ ప్రాంతాల్లో మట్టిచెరియలు కొండ రైలు మార్గంపై పడుతుండడంతో ఈ రైలు సేవలకు అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో, ఈ నెల 13 నుంచి 17వ తేది వరకు నీలగిరి(Neelagiri) జిల్లాకు భారీ వర్షసూచన ప్రకటించారు. దీంతో, ముందస్తు చర్యల కింద కొండ రైలు సేవలు ఐదు రోజులు రద్దు చేశారు. మేట్టుపాళయం నుంచి ఊటీకి కొండ రైలు బయల్దేరడంపై పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి   సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి 
లోక‌ల్ గైడ్: కేబినెట్ నిర్ణయం మేరకు ఈ సంక్రాంతి తర్వాత అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు....
పార్ల‌మెంట్‌లో గంద‌ర‌గోళం
బలగం సినిమా గాయకుడు మొగిలయ్య కన్నుమూత
మేట్టుపాళయం నుంచి ఊటీ మధ్య కొండ రైలు సేవలు ప్రారంభం
ముంబ‌యి సముద్ర తీరంలో ఘోర ప‌డ‌వ ప్ర‌మాదం
సీనియర్ సిటిజన్లందరికీ 'సంజీవని యోజన'
కొండెక్కినా కోడిగుడ్డు ధర