తాలిబాన్లకు భారత్‌ నిధులు

తాలిబాన్లకు భారత్‌ నిధులు

 కశ్మీరీ, ఖలిస్థానీ, పాకిస్థాన్‌ వ్యాప్తంగా దేశ వ్యతిరేక నాయకులను చంపేందుకు అఫ్ఘానిస్థాన్‌ తాలిబాన్లకు భారత్‌ 10 మిలియన్‌ డాలర్ల (రూ.83.36 కోట్లు) నిధులు సమకూరుస్తోందంటూ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ-అమెరికా) మాజీ అధికారి సారా ఆడమ్స్‌ సంచలన ఆరోపణలు చేశారు.

 

ఈ నిధులను తాలిబాన్లు తెహ్రీక్‌-ఈ-తాలిబాన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ)కి చేరవేస్తూ హత్యలకు పథకాలు అమలు చేస్తున్నారన్నారు. అమెరికా మాజీ నేవీ సీల్‌ అధికారి, సీఐఏ కాంట్రాక్టర్‌ షాన్‌ ర్యాన్‌ నిర్వహించిన 'షాన్‌ ర్యాన్‌ షో'లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

అలాగే పాక్‌కు చెందిన జమియత్‌ ఉలేమా-ఈ-ఇస్లాం (ఎఫ్‌) రాజకీయ పార్టీకి తాలిబాన్లు, అల్‌ఖైదా రెండింటితోనూ సంబంధాలున్నాయని.. వారు పాక్‌లోని ఫెడరల్లీ అడ్మినిస్ట్రేడ్‌ ట్రైబల్‌ ఏరియాస్‌ (ఎఫ్‌ఏటీఏ) ను స్వాధీనం చేసుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని వెల్లడించారు. ఆడమ్స్‌ వ్యాఖ్యలను ఎవరూ ధ్రువీకరించనప్పటికీ.. ఆమె నేపథ్యాన్ని బట్టి లేవనెత్తిన అంశాలపై విచారణకు దారితీసే అవకాశం లేకపోలేదు.

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

 సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి   సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి 
లోక‌ల్ గైడ్: కేబినెట్ నిర్ణయం మేరకు ఈ సంక్రాంతి తర్వాత అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు....
పార్ల‌మెంట్‌లో గంద‌ర‌గోళం
బలగం సినిమా గాయకుడు మొగిలయ్య కన్నుమూత
మేట్టుపాళయం నుంచి ఊటీ మధ్య కొండ రైలు సేవలు ప్రారంభం
ముంబ‌యి సముద్ర తీరంలో ఘోర ప‌డ‌వ ప్ర‌మాదం
సీనియర్ సిటిజన్లందరికీ 'సంజీవని యోజన'
కొండెక్కినా కోడిగుడ్డు ధర