బదిలీపై వెళ్తున్న జిల్లా జడ్జికి వీడ్కోలు పలికిన కలెక్టర్
By Ram Reddy
On
లోకల్ గైడ్ :
నిజామాబాద్ జిల్లా జడ్జిగా విధులు నిర్వర్తించి బదిలీపై వెళ్తున్న జిల్లా సెషన్స్ జడ్జి సునీత కుంచాలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఘనంగా వీడ్కోలు పలికారు. గురువారం సాయంత్రం జిల్లా కోర్టు భవన సముదాయంలోని ఛాంబర్ లో జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్, ఆమెకు పూల బొకేను అందించి, జ్ఞాపికను బహూకరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా కలెక్టర్ ప్రస్తావిస్తూ అభినందనలు తెలియజేశారు. సామాజిక సేవా కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం తరపున విశేష తోడ్పాటును అందించారని సెషన్స్ జడ్జి సునీత కుంచాల కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
Tags:
Comment List