‘డియర్ ఉమ’ చిత్రాన్ని అందరూ చూసి సక్సెస్ చేయండి.. నిర్మాత, రచయిత, హీరోయిన్ సుమయ రెడ్డి 

‘డియర్ ఉమ’ చిత్రాన్ని అందరూ చూసి సక్సెస్ చేయండి.. నిర్మాత, రచయిత, హీరోయిన్ సుమయ రెడ్డి 

తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా ‘డియర్ ఉమ’ అనే చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఈ మూవీకి లైన్ ప్రొడ్యూసర్‌గా నగేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా నితిన్ రెడ్డి వ్వవహరించారు. ఇక ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ఎన్నో చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన రాజ్ తోట కెమెరామెన్‌గా, బ్లాక్ బస్టర్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన రదన్ సంగీత దర్శకుడిగా పని చేశారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో..

రచయిత, నిర్మాత, హీరోయిన్ సుమయ రెడ్డి మాట్లాడుతూ .. ‘అనంతపూర్ నుంచి వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి గుమ్మడి కాయ కొట్టే వరకు సపోర్ట్ చేసిన మీడియాకు థాంక్స్. మీడియానే మా ఈవెంట్‌కు ముఖ్య అతిథి. సాయి రాజేష్ గారు నేను చెప్పాల్సిందంతా చెప్పేశారు. తెలుగమ్మాయిలు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎక్కువగా వస్తున్నారు. నేను ఓ అడుగు ముందుకు వేసి సినిమాని నిర్మించాను. అందరూ నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నేను రాసిన, తీసిన షార్ట్ ఫిల్మ్‌కు మంచి ఆదరణ దక్కింది. ఆ తరువాత సాయి రాజేష్ గారితో మళ్లీ డియర్ ఉమకు పని చేశాం. నాకు అండగా నిలిచిన మధు, చక్రవర్తిలకు థాంక్స్. నవీన్ గారి వల్లే రదన్ గారు మా ప్రాజెక్టులోకి వచ్చారు. ప్రతీ ఒక్కరూ వారి వారి డ్రీమ్ ప్రాజెక్టుకి పని చేసినట్టుగానే వర్క్ చేశారు. ప్రతీ మగాడి విజయం వెనుక ఆడది ఉన్నట్టే.. ప్రతీ అమ్మాయి విజయం వెనకాల ఓ అబ్బాయి ఉంటాడు. నగేష్ ఈ ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచీ నాతో పాటే ఉన్నారు. మీ కోసం మీరు నిలబడకపోతే, మీ కోసం ఎవరూ నిలబడరు. ఎంతో కష్టపడి ఈ ప్రాజెక్ట్‌ను ఇక్కడి వరకు తీసుకు వచ్చాను. ఏప్రిల్ 18న మా చిత్రం థియేటర్లోకి రాబోతోంది. అందరూ చూసి సినిమాని విజయవంతం చేయండి’ అని అన్నారు.

పృథ్వీ అంబర్ మాట్లాడుతూ .. ‘డియర్ ఉమ సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది. నాకు ఎంతో సపోర్ట్ చేసిన టీంకు థాంక్స్. నా దియా చిత్రాన్ని ఇక్కడ అందరూ ఆదరించారు. మొదట్లో తెలుగు అంతగా అర్థం అయ్యేది కాదు. ఇప్పుడు తెలుగు నేర్చుకుంటున్నాను. సుమయ రెడ్డి ఈ చిత్రం కోసం చాలా కష్టపడింది. డియర్ ఉమ సినిమాను ఏప్రిల్ 18న అందరూ చూడండి’ అని అన్నారు.

డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ .. ‘డియర్ ఉమ చిత్రం కోసం మా టీం అంతా చాలా కష్టపడింది. బుర్రకథ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశాను. అక్కడే సుమయ రెడ్డి గారిని కలిశాను. ఆ తరువాత ఓ షార్ట్ ఫిల్మ్‌కి పని చేశాం. కరోనా టైంలో సుమయ రెడ్డి గారు ఓ కథ రాశారు. అది నాకు చాలా నచ్చింది. అలా డియర్ ఉమ చిత్రం మొదలైంది. మేం ఈ కథను నమ్మి చాలా మంది వద్దకు తిరిగాం. కానీ కథలో చాలా మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చింది. అందుకే సుమయ రెడ్డి గారే స్వయంగా నిర్మించేందుకు ముందుకు వచ్చారు. సమాజానికి ఓ సందేశాన్ని ఇవ్వాలని ఆమె సినిమాను నిర్మించారు. ఆ తరువాత ఒక్కొక్కరిగా టీంలోకి వచ్చారు. రాజ్ తోట గారి కెమెరా వర్క్ అందరికీ నచ్చుతుంది. రదన్ గారి సంగీతం అద్భుతంగా వచ్చింది. సుమయ రెడ్డి గారి నటన, పృథ్వీ అంబర్ గారి యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంటంది. మా చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది. మా వెనకాల ఎవ్వరూ లేదు. మాకు మీడియా, ఆడియెన్స్ సపోర్ట్ కావాలి. సమాజానికి ఈ సినిమా అవసరం ఉంది. అందుకే చిత్రాన్ని తీశాం. డియర్ ఉమ సినిమాను అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News