భార‌త ప్ర‌భుత్వాన్ని కోర్టులో స‌వాల్ చేసిన ఎక్స్ సంస్థ

భార‌త ప్ర‌భుత్వాన్ని కోర్టులో స‌వాల్ చేసిన ఎక్స్ సంస్థ

లోకల్ గైడ్:

సోష‌ల్ మీడియా ఎక్స్ సంస్థ‌.. భార‌త ప్ర‌భుత్వాన్ని స‌వాల్ చేసింది. క‌ర్నాట‌క హైకోర్టులో దావా దాఖ‌లు చేసింది. ఐటీ చ‌ట్టంలోని 79(3)(బీ) సెక్ష‌న్‌ను భార‌త ప్ర‌భుత్వం దుర్వినియోగం చేస్తున్న‌ట్లు చెప్పింది. ఐటీ చ‌ట్టంలోని సెక్ష‌న్ 69ఏను స‌ర్కారు విస్మ‌రిస్తోంద‌ని ఎక్స్ ఆరోపించింది. సెన్సార్‌షిప్‌, ఐటీ ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు ఆరోపించింది. బెంగుళూరు: బిలియ‌నీర్ ఎల‌న్ మ‌స్క్‌కు చెందిన ఎక్స్(X) సోష‌ల్ మీడియా సంస్థ.. భార‌త స‌ర్కారుపై కోర్టులో దావా దాఖ‌లు చేసింది. క‌ర్నాట‌క హైకోర్టులో ఆ కేసును ఫైల్ చేసింది. భార‌త ప్ర‌భుత్వం అక్ర‌మ రీతిలో కాంటెంట్‌ను నియంత్రిస్తున్న‌ద‌ని, సెన్సార్‌షిప్‌కు పాల్ప‌డుతున్న‌ట్లు ఆ దావాలో ఎక్స్ సంస్థ ఆరోపించింది. భార‌త స‌ర్కారు ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ చ‌ట్టాన్ని వాడుతున్న తీరుపై ఎక్స్ సంస్థ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఐటీ చ‌ట్టంలోని 79(3)(బీ) సెక్ష‌న్‌ను భార‌త ప్ర‌భుత్వం అక్ర‌మ‌రీతిలో వినియోగిస్తున్న‌ట్లు ఎక్స్ ఆరోపించింది. ఆ సెక్ష‌న్ అమ‌లు.. సుప్రీంకోర్టు ఉత్త‌ర్వుల‌ను ఉల్లంఘిస్తున్న‌ట్లు ఎక్స్ త‌న దావాలో పేర్కొన్న‌ది. ఆ సెక్ష‌న్ ద్వారా ఆన్‌లైన్‌లో భావ‌స్వేచ్ఛ‌ను అడ్డుకుంటున్న‌ట్లు ఎక్స్ ఆరోపించింది.

About The Author

Post Comment

Comment List

Latest News