3,772 కోట్ల రూపాయల పెయింటింగ్

 3,772 కోట్ల రూపాయల  పెయింటింగ్

సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌

సౌదీ అరేబియా రాజు 90 ఏళ్ల అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ 2015 జనవరిలో తుది శ్వాస విడిచారు. అనంతరం ఆయన సోదరుడు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ రాజు కాబోతున్న సమయంలో అల్ సౌద్ కుమారుడు మహ్మద్ బిన్ సల్మాన్ కూడా అధికారం కోసం సిద్ధమయ్యారు.

 

మహ్మద్ బిన్ సల్మాన్‌ను ఎంబీఎస్ అని పిలుస్తుంటారు. అప్పటికి ఆయన వయసు 29 ఏళ్లు. అయితే సౌదీ అరేబియా సామ్రాజ్యం కోసం ఎంబీఎస్ చాలా పెద్ద ప్లాన్ వేశారు. అది సౌదీ అరేబియా చరిత్రలోనే అతిపెద్ద పథకం అని భావించవచ్చు.

అయితే, సొంత రాజకుటుంబ సభ్యులే తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తారని ఆయన భయపడ్డారు. దీంతో ఆ నెలలో ఒకరోజు రాత్రి ఎంబీఎస్ ఒక సీనియర్ భద్రతాధికారిని ప్యాలెస్‌కు పిలిపించారు. ఆయన పేరు సాద్ అల్ జాబ్రీ.

ఆయన ఫోన్‌ను గది బయటే టేబుల్‌పై ఉంచాలని చెప్పారు. ఎంబీఎస్ కూడా ఫోన్‌ను బయటే ఉంచారు. రాజభవనంలోని గూఢచారుల పట్ల యువరాజు సల్మాన్ ఎంత జాగ్రత్తగా ఉన్నారంటే, గదిలో ఉన్న ఏకైక ల్యాండ్‌లైన్ వైర్‌ను కూడా తీసేశారు.

నిద్రలో ఉన్న దేశాన్ని'' ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారో ఒక ప్రణాళిక రూపంలో ఎంబీఎస్ వివరించారని జాబ్రీ చెప్పారు. ఆ ప్రణాళికతోనే ప్రపంచ వేదికపై సౌదీ సరైన స్థానాన్ని పొందగలదని ఆయన చెప్పారని తెలిపారు.

ఆరామ్‌కోలోవాటాలను విక్రయించి, చమురుపై తన ఆర్థిక వ్యవస్థ ఆధారపడటం ఆపేస్తానని ఎంబీఎస్ చెప్పారు. టాక్సీ సంస్థ ఉబెర్‌, సిలికాన్ వ్యాలీలోని టెక్ స్టార్టప్‌లలో బిలియన్ల కొద్దీ పెట్టుబడులు పెడతానన్నారు. సౌదీ మహిళలకు పని చేసే స్వేచ్ఛను కల్పించడం ద్వారా దేశంలో 60 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టిస్తానని ఆయన చెప్పారు.

ఎంబీఎస్ మాటలకు ఆశ్చర్యపోయిన జాబ్రీ, ఆయన ఆశయ సాధన ఎంతదూరంలో ఉందని ప్రశ్నించారు. దీంతో ఎంబీఎస్ సూటిగా "అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి మీరు విన్నారా?" అని బదులిచ్చినట్లు జాబ్రీ చెప్పారు. అరగంట జరగాల్సిన సమావేశం మూడు గంటలసేపు సాగింది. అప్పటికే జాబ్రీ మొబైల్ ఫోన్‌కు చాలా మిస్డ్ కాల్స్ వచ్చాయి. ఆ తరువాత జాబ్రీ గది నుంచి వెళ్లిపోయారు.

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

 సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి   సంక్రాంతి తర్వాతా కొత్త రేషాన్ కార్డులు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి 
లోక‌ల్ గైడ్: కేబినెట్ నిర్ణయం మేరకు ఈ సంక్రాంతి తర్వాత అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు....
పార్ల‌మెంట్‌లో గంద‌ర‌గోళం
బలగం సినిమా గాయకుడు మొగిలయ్య కన్నుమూత
మేట్టుపాళయం నుంచి ఊటీ మధ్య కొండ రైలు సేవలు ప్రారంభం
ముంబ‌యి సముద్ర తీరంలో ఘోర ప‌డ‌వ ప్ర‌మాదం
సీనియర్ సిటిజన్లందరికీ 'సంజీవని యోజన'
కొండెక్కినా కోడిగుడ్డు ధర