అంబానీ నుంచి మస్క్ వరకు.. బిలినీయర్లకు ఉన్న అలవాట్లు ఇవే!
ప్రపంచంలో వందల కోట్ల జనాభా ఉన్నారు. ఇందులో కొంత మంది మాత్రమే బిలినీయర్లుగా ఎదిగారు. కోటీశ్వరులుగా ఎదిగిన చాలా మంది కొన్ని అలవాట్లను తూ.చ ఖచ్చితంగా పాటిస్తున్నారు.
ముకేశ్ అంబానీ నుంచి ఇలాన్ మస్క్ వరకు సక్సెస్ సాధించిన వ్యక్తులందరూ ఎలాంటి అలవాట్లను పాటిస్తారనేది ఈ కథనంలో చూసేద్దాం..
ఉదయం త్వరగా మేల్కొనటం
ముకేశ్ అంబానీ నుంచి ఇలాన్ మస్క్ వరకు దాదాపు చాలామంది బిలినీయర్లు రాత్రి ఎంత సమయానికి నిద్రపోయినా.. ఉదయం మాత్రం 5:30 గంటలకే నిద్రలేస్తారు. ఇది వారి ఫిట్నెస్కు మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుంది. ప్రతి ఒక్కరూ రాత్రి త్వరగా పడుకుని ఉదయం ముందుగా నిద్రలేవాలి. ఇది ఓ మంచి అలవాటు.
చదవడం
చదవడం అనేది చాలామంది అలవాటు. బిల్ గేట్స్ సంవత్సరానికి 50 పుస్తకాలు చదువుతానని గతంలో పేర్కొన్నారు. ఇది సమాజం పట్ల అవగాహనను మాత్రమే కాకుండా.. మానసిక ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. కాబట్టి పుస్తక పఠనం అలవాటు చేసుకోవడం ఉత్తమ అలవాటు.
వ్యాయామం
అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ప్రతి రోజూ వ్యాయామంతోనే రోజు మొదలుపెడతారు. శారీరక దృఢత్వం కోసం వ్యాయామం చేయడం అలవాటుగా చేసుకోవాలి. ప్రతి రోజూ కనీసం ఒక అరగంట వివిధ రకాల వ్యాయామాలు చేయాలి. ప్రతిరోజూ వ్యాయామం కూడా దినచర్యలో భాగం చేసుకోవడం ఉత్తమ అలవాటు.
నిద్ర
శరీరానికి ఆహారం ఎంత అవసరమో.. నిద్ర కూడా అంతే అవసరం. రాత్రి కనీసం ఎనిమిది గంటలకు తగ్గకుండా ప్రతి ఒక్కరు నిద్రపోవాలి. ఇది వారి ఆలోచనా శైలిని పెంచుతుంది. బిలినీయర్లు ప్రతి రోజూ ఒకే సమయానికి నిద్రపోతారు. ప్రతి ఒక్కరు నిద్రకు సరైన సమయం కేటాయిస్తే ఒక నెలరోజుల్లో మీలో మార్పు వస్తుందని అమెరికన్ వ్యాపారవేత్త మార్క్ క్యూబన్ చెబుతున్నారు.
సామజిక కార్యక్రమాల్లో పాల్గొనటం
సక్సెస్ సాధించడానికి సామజిక అనుబంధాలు కూడా చాలా ముఖ్యం. ముకేశ్ అంబానీ నుంచి ఇలాన్ మస్క్ వరకు చాలామంది సామజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వారిలో ఓ నూతన ఉత్సాహం వస్తుందని నమ్మకం. కాబట్టి సాధ్యమైనప్పుడల్లా సామజిక కార్యక్రమాల్లో పాల్గొనటం ఉత్తమం.
Comment List