పురుషోత్తపట్నం ముత్యాలమ్మ దేవాలయానికి గొంగడి త్రిష 2 లక్షలు వితరణ.
లోకల్ గైడ్ :
పురుషోత్త పట్న గ్రామంలో గ్రామదేవతల ఆలయాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ముత్యాలమ్మ తల్లి ఆలయానికి 2 లక్షల రూపాయలను వితరణగా ఇవ్వడం జరిగింది. గొంగడి త్రిష తన తాతగారైన కేతిరెడ్డి గురువారెడ్డి పేరు మీద ముత్యాలమ్మ గుడి ఉన్నది కావున వాళ్ల తాత పేరు నిలబడటం కోసం తన తండ్రి గొంగడి రామిరెడ్డి సహాయంతో తన అన్న గొంగడి వెంకటరామిరెడ్డి చేతుల మీదగా ముత్యాలమ్మ దేవాలయం ఎదురుగా ఊరి పెద్దలకి 2 లక్షల రూపాయలను అందజేయడం జరిగింది.క్రికెట్ రంగం లో అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రక్యాతులు తెచ్చుకున్నా సొంత ఊరు పట్ల తనకు ఉన్న అభిమానానికి పురుషోత్తపట్నం గ్రామ ప్రజలు.పురప్రముఖులు ఈ సందర్బంగా గొంగడి త్రిష ను,తండ్రి గొంగడి రామిరెడ్డి ని అభినందించారు. పురుషోత్తపట్నంలోని గ్రామదేవతల ఆలయాల పునర్వ్యవస్థీకరణలో సంప్రోక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సంరక్షణ కార్యక్రమంలో పురుషోత్తపట్నం లోని గుడి కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు, పురుషోత్తపట్నం గ్రామస్తులు పాల్గొన్నారు.
Comment List