జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు చేతుల్లో మృతి చెందిన వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన.
టీఎన్జీవోస్ అధ్యక్షు, కార్యదర్శులు. డెక్క నరసింహారావు. గగ్గూరి, బాలకృష్ణ.
లోకల్ గైడ్ : స్థానిక టీఎన్జీవోస్ కార్యాలయం నందు అధ్యక్ష కార్యదర్శులు డెక్క నరసింహారావు గగ్గూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో మధ్యాహ్నం భోజనం విరామ సమయంలో స్థానిక నీటిపారుదల శాఖ సర్కిల్ ఆఫీస్ భద్రాచలం నందు మొన్న జమ్ము కాశ్మీర్ పహల్గమ్ నందు ఉగ్రవాదులు జరిపిన కాల్పులలొ అశువులు బాసిన 27 మంది చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచి, మౌనం పాటించారు, తదనంతరం నల్లబ్యాడ్జీలు ధరించి పాకిస్తాన్ చర్య పట్ల తీవ్ర నిరసన తెలియజేశారు. సందర్భంగా మాట్లాడుతూ పాకిస్తాన్ చర్య పిరికిపంద చర్యలని, ఇటువంటి చర్యలకు తగిన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉన్నదని, దాని అనుగుణంగా త్వరలోనే భారత ప్రభుత్వం ధీటైన సమాధానం చెబుతుందనితెలియజేస్తూ.యావత్ ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఈ చర్యను తీవ్రంగా ఖండించాయని తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా నీటిపారుదల శాఖ కార్యదర్శి మరియు నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు శ్యామల శ్రీనివాస్, సాధిక్ భాష మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇటువంటి పిరికిపంద చర్యలకు పాల్పడితే భారత సైన్యం త్వరలోనే వాళ్ళ పీచం అనచవలసిన సమయం ఆసన్నమైనదని త్వరలో అది జరిగితీరుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ పడిగ నరసింహారావు బాలకృష్ణ హరన్ గాంధీ లింగమూర్తి వెంకటరమణ మల్లికార్జున ప్రసాద్ శాంత కుమారి, గంగరాజు అన్వర్ పాపారావు సత్యనారాయణ తదితరు ఉద్యోగస్తులు పాల్గొన్నారు.
Comment List