రజతోత్సవ సభకు కదం తొక్కుతున్న కార్మికులు
కె.సి.ఆర్ హాయంలో కార్మిక సంక్షేమం.
కార్మిక సంఘాలకు అండగా నిలిచిన నిరంజన్ రెడ్డి.
కార్మిక సంఘాలకు అండగా నిలిచిన నిరంజన్ రెడ్డి.
రజతోత్సవ సన్నాహక సమావేశంలో
జిల్లానాయకులు గట్టుయాదవ్,వాకిటి.శ్రీధర్,
లోకల్ గైడ్:
ఏప్రిల్ 27న వరంగల్ నందు జరగబోవు గంజి హమాలీల రజతోత్సవ సన్నాహక సమావేశం మార్క్ ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్ అధ్యక్షతన వహించారు.ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గంజి, న్యూగంజి, చాట కూలీలు, తోపుడు బండ్ల సంఘం,ఆటో యూనియన్ సంఘాల అభివృధి కోసం కృషి చేశారని వారి కష్టసుఖాల్లో పాలుపంచుకొని కుటుంబ పెద్దగా వ్యవహరించారని వారి నాయకత్వములో రజతోత్సవ సభకు తరలివస్తున్నారని అన్నారు. అదేవిధంగా 33,23వార్డుల సన్నాహక సమావేశం మాజీ కౌన్సిలర్ ఉంగ్లం. తిరుమల్,నాయకులు యుగంధర్ రెడ్డి పాల్గొన్నారు. ఇట్టి సమావేశంలో గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ పలుస.రమేష్ గౌడ్ గంధం.పరంజ్యోతి పాల్గొని పోస్టర్స్ విడుదల చేసి సభకు సమాయత్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఇచ్చిన వాగ్దానాలు అమలు కాక మళ్ళీ కె.సి.ఆర్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారని సభ విజయవంతం కోసం ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుందని తెలిపారు.
Comment List