ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టొప్పో

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టొప్పో

మహబూబాబాద్, లోకల్ గెడ్ తెలంగాణ 

సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ప్రజల నుండి వినతులు స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లాలోని షెడ్యూల్డ్ అభివృద్ధి శాఖ లో అవుట్ సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్న ఉద్యోగుల  కొన్ని నెలల జీతాలు  పెండింగ్ లో ఉన్నాయని, అదే విధంగా  ఈ.ఎస్.ఐ, ఈ.పి.ఎఫ్ ల జమలు కూడా పెండింగ్ లో ఉన్నాయని   మా సమస్యను పరిష్కరించాలని కోరారు.

డోర్నకల్ మండలం ఎర్రమట్టి తండాకు చెందిన గుగులోతు పద్మ తను రేకుల ఇంటిలో నివసిస్తున్నానని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు.నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామానికి చెందిన రైతులు తమ భూములను సర్వే చేపించి పట్టాలు ఇప్పించగలరని కోరారు. గార్ల మండలం మద్దివంచ గ్రామానికి చెందిన గ్రామస్తులు తమ గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ పాటశాలకు కావాల్సిన స్థలాన్ని కమిటీ ఆద్వర్యంలో కొనుగోలు చేసిన స్థలాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఆక్రమించుకుంటున్నారని, రెవెన్యు రికార్డుల పరంగా సర్వే చేసి పాటశాలకు హద్దులు ఏర్పాటు చేయగలరని కోరారు.  ఈ సందర్భంగా రెవెన్యూ(33),మునిసిపల్ అడ్మినిస్ట్రేటివ్(7),డి.ఆర్.డి.ఓ(5),ఎంప్లాయ్మెంట్(3) ఈ విధంగా వివిధ శాఖలకు సంబందించి ఈ రోజు ప్రజావాణి లో వచ్చిన ( 63) దరఖాస్తులను పరిష్కారం కొరకు అధికారులను ఆదేశించారు. ఈ ప్రజావాణి లో జెడ్.పి సీ.ఈ.ఓ పురుషోత్తం, తొర్రూరు ఆర్డీఓ గణేష్, డి.ఆర్.డి.ఓ మధుసూదనరాజు, సి.పి.ఓ సుబ్బారావు, డి.పి.ఓ హరిప్రసాద్, డి.సి.ఓ వెంకటేశ్వర్లు, డి.హెచ్.ఎస్.ఓ మరియన్న, బి.సి, ఎస్.సి డెవలప్మెంట్ అధికారులు నరసింహా స్వామి, శ్రీనివాసరావు, డి.ఎం.సివిల్ సప్లై అధికారి కృష్ణవేణి, గ్రౌండ్ వాటర్ అధికారి సురేష్, జి.ఎం.ఇండస్ట్రీస్ శ్రీమన్నారాయణ, మత్స్య శాఖ అధికారి వీరన్న, ఎల్.డి.ఎం సత్యనారాయణ మూర్తి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ మదన్ మోహన్, వివిధ మండలాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కలియుగమ్‌-2064’ ట్రైల‌ర్ రిలీజ్ కలియుగమ్‌-2064’ ట్రైల‌ర్ రిలీజ్
లోకల్ గైడ్: ‘కలియుగమ్‌-2064’ ట్రైల‌ర్ రిలీజ్  శ్రద్ధా శ్రీనాధ్‌, కిశోర్‌ ప్రధానపాత్రల్లో నటించిని తాజా చిత్రం ‘కలియుగమ్‌-2064’ .  శ్రద్ధా శ్రీనాధ్‌, కిశోర్‌ ప్రధానపాత్రల్లో నటించిని తాజా...
భూ భారతి చట్టం ద్వారా పెండింగ్ భూ సమస్యలకు పరిష్కారం
హైదరాబాద్ డివిజన్‌లోని కర్నూల్ సిటీ
మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి 
‘భూ భారతి 2025' నూతన ఆర్.ఓ.ఆర్ చట్టం భూ
భూమి అంటే ఆదాయాన్ని ఇచ్చే వనరే కాదు