INTSO లో విజయం సాధించిన శ్రీ చైతన్య విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
By Ram Reddy
On
లోకల్ గైడ్ :
జాతీయ స్థాయిలో నిర్వహించే ఐ ఎన్ టి ఎస్ ఒలంపియాడ్ పరీక్షల్లో శ్రీ చైతన్య జడ్చర్ల శాఖ విద్యార్థులు గెలుచుకున్న బహుమతులను ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారని ప్రిన్సిపల్ డాక్టర్ సజీలా పర్వీన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. స్థానిక చంద్ర గార్డెన్స్ లో భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగాపాల్గొన్న శాసనసభ్యులు అనిరుద్ధ్ రెడ్డి చేతుల మీదుగా బహుమతి లాప్టాప్ కుమారి సమయ 9వ తరగతి,హెడ్సెట్ ఆరవ తరగతి చదువుతున్న మేధాన్శ్ రెడ్డి అందుకోగా సర్టిఫికెట్ గోల్డ్ మెడల్ తొమ్మిదవ తరగతి చదువుతున్న సహస్ర రెడ్డి అందుకున్నట్లు పాఠశాల డీన్ విజయవర్ధన్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ప్రతిభ చూపించిన విద్యార్థులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అనిత, మర్రెడ్డి,సాకేత ప్రవీణ్ పాల్గొన్నారు.
Tags:
Comment List