తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనం 

తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనం 

హైదరాబాద్,లోకల్ గైడ్ తెలంగాణ:
తెలంగాణ ఉద్యమకారుల వేదిక చైర్మన్ కంచర్ల బద్రి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సమ్మేళనం నిర్వహించారు. 
ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి,టి యు జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి,సెక్రెటరీ జనరల్ తుమ్మల ప్రఫుల్ రామ్ రెడ్డి, ఓయు జేఏసీ నాయకులు మాందాల భాస్కర్, స్టాలిన్, వీరస్వామి, చాగంటి రాములు విజయ్ ఈరెంటి, పెంచాలా సతీష్ , హరినాథ్, కేయు జేఏసీ నాయకులు దుర్గం సారయ్య, పాలమూరు యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకులు అన్వర్, వినోద్, పుట్ట రంజిత్, బలిచక్రవర్తి తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ అధ్యక్షులు మోహన్ బైరాగి,డోలక్ యాదగిరి లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థుల పాత్ర చారిత్రాత్మకం అని ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలను సమన్వయం చేసి తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లిన ఘనత తెలంగాణ విద్యార్థులదనీ తెలిపారు .ఉద్యమంలో ముందు వరుసలో ఉండి లాఠీలకు,తూటాలకు ఎదు రొడ్డి పోరాడింది, ప్రాణ త్యాగాలు చేసింది విద్యార్థులే. మలిదశ తెలంగాణ పోరాటం వెనకడుగువేసిన ప్రతి సందర్భంలో ఆత్మబలి దానాలతో నిప్పును రాజేసింది, ఉద్యమానికి ఊపిరి పోసింది, ఉద్యమ ద్రోహులను ఉరికిచ్చింది, బరిగీసి కొట్లాడిందీ విద్యార్థి లోకమే అని తెలిపారు.విద్యార్థులు ఉద్యమాన్ని తమ భుజాన వేసుకుని, పాదయాత్రతో తెలంగాణ ప్రతి పల్లెను తట్టి లేపి,కొట్లాడి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించారని ,  కానీ చరిత్రలో విద్యార్థుల త్యాగాలకు దక్కాల్సిన గుర్తింపు, గౌరవం దక్కలేదు అని తెలిపారు.అందాల్సిన ప్రతిఫలం అందలేదు. చదువులను, ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ ఆస్తిత్వం,ఆత్మగౌరం కోసం, పీడిత ప్రజల విముక్తి లక్ష్యంగా సీమాంధ్ర వలస పాలకుల అధిపత్యానికి వ్యతిరేకంగా, ఆత్మ బలిదానాలతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో విద్యార్థి ఉద్యమకారులను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలిపారు. తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక ప్రతిపాదించిన డిమాండ్లూ న్యాయమైనవే అని తెలిపారు. తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వాలని అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల పై పెట్టిన కేసులు ఎత్తివేయాలనీ, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించిన 26 ఇంటి స్థలం తదితర న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News