పవర్ లిఫ్టింగ్ జిల్లా క్రీడాకారులను అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.

జిల్లా జనరల్ సెక్రటరీ జీవీరామిరెడ్డి.

పవర్ లిఫ్టింగ్ జిల్లా క్రీడాకారులను అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.

లోకల్ గైడ్: న్యూస్ ఖమ్మంలో జరిగిన రెండు జిల్లాల స్థాయి బెంచ్ ప్రెస్ పోటీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జట్టు,  మాస్టర్ టీం ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకోగా భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కు  చెందిన డివి శంకర్రావు ( రిటైర్డ్ ఎస్బిఐ మేనేజర్) మాస్టర్ 4 క్యాటగిరిలో 83 కేజీ విభాగంలో 60 కేజీల బరువు ఎత్తి బంగారు పతకం సాధించారు. అంతేకాకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మాస్టర్ టీం చాంపియన్షిప్ కూడా కైవసం చేసుకుంది. అలాగే ఈనెల 18 19 తారీకులలో హైదరాబాదులో జరిగిన క్లాసిక్ పవర్ లిప్టింగ్ పోటీలలో  66 కేజీల విభాగంలో మోడెం వంశీకి బంగారు పతకం,  మాస్టర్ 2 విభాగంలో  93 కేజీ కేటగిరీలో భవాని శంకర్ కు  రజిత పతకం, ఎం రంగారావుకు   మాస్టర్ 2 విభాగంలో 105 కేటగిరీలో  బంగారు పతకం  సాధించినట్లు జిల్లా జనరల్ సెక్రటరీ జీవీ రామిరెడ్డి తెలిపారు. ఈ గెలుపొందిన క్రీడాకారులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్   తన కార్యాలయంలో అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాకు మంచి పేరు తెస్తున్న క్రీడాకారులను మరియు జిమ్ కోచ్ లను  జిల్లా అసోసియేషన్ సభ్యులను అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రెటరీ  జివి రామిరెడ్డి,డివి శంకర్రావు, ఎం రంగారావు, భవాని శంకర్ పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News