రైతులకు అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం
దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నాలకు బోనస్ ఇస్తున్న మొట్ట మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం
వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
లోకల్ గైడ్: రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు తెలిపారు.గురువారం రోజున ఖిల్లావరంగల్ పాక్స్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ గ్రామం లో ఏర్పాటు చేసిన యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు అతి ముఖ్యమైన పథకాల ద్వారా రైతులకు, పేద ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. అవి సన్నాలు పండిస్తున్న రైతులను ప్రోత్సహించడానికి మద్దతు ధరతో పాటు క్వింటాకు 500బోనస్, రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాలు అని అన్నారు. 25లక్షల మంది రైతులకు ఒక ఏడాదిలోనే 21వేల కోట్ల రుణ మాఫీ చేయడంతో పాటు ఉచిత కరెంట్, రైతు భరోసా, 500బోనస్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని తెలిపారు.అందుకోసమే రాష్ట్రంలో సన్నాలు పండించే రైతులను ప్రోత్సహస్తుందని అన్నారు. దీనివల్ల మన రైతుల వద్దనే సన్నాలు కోని మళ్ళీ మనకే సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అందువలన రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే పంటను అమ్మాలని సూచించారు. వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియడం లేదని కావున కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్లను అందుబాటులో ఉంచుకోవాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. తేమ 17శాతం ఉండాలని, బస్తా 41కేజీలు మాత్రమే తూకం వేయాలని ఈ విషయంలో రైతులను ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేశారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం విక్రయించాలని, దళారుల వద్దకు వెళ్లి నష్టపోవద్దని సూచించారు. ఇంత గొప్ప ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై మీ అందరి ఆశీస్సులు, దీవెనలు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ ఛైర్మెన్ కేడల జనార్ధన్, కార్పొరేటర్లు అరుణ - విక్టర్, జలగం అనిత - రంజిత్ రావు, వ్యవసాయ శాఖ అధికారులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Comment List