కాటేరమ్మ కొడుకుల ఆటలో రైజర్స్‌ పరాజయం.....!

కాటేరమ్మ కొడుకుల ఆటలో రైజర్స్‌ పరాజయం.....!

లోకల్  గైడ్:

వరుస పరాభవాలు ఎదురవుతున్నా ఐపీఎల్‌-18లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) ఆటతీరులో మార్పు రావడం లేదు. ప్రత్యర్థుల వేదికలతో పాటు సొంత మైదానంలోనూ సన్‌రైజర్స్‌ బొక్కబోర్లా పడుతున్నది. ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే గెలుపు బాట పట్టాల్సిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ మరోసారి బ్యాటింగ్‌ వైఫల్యంతో చేతులెత్తేసింది. ఈ ఏడాది IPLలో SRH ప్లే ఆఫ్స్ ఆశలు ఇక ముగిసినట్లేనని క్రికెట్ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 8 మ్యాచులాడి రెండే గెలవడం, రన్రేట్ మరీ ఘోరంగా ఉండటం, ఇప్పటికే 2 జట్లు 12 పాయింట్లు, 4 జట్లు 10 పాయింట్లు సాధించడంతో మిగిలిన అన్ని మ్యాచులూ గెలిచినా SRH ప్లే  ఆఫ్స్ చేరడం కష్టమేనంటున్నారు. నిన్న రాత్రి ముంబై మీద సన్రైజర్స్ ఘోరంగా ఓడిన సంగతి తెలిసిందే. అన్ని విభాగాల్లోనూ రైజర్స్ విఫలమవుతున్నారు. ఆ తర్వాత మాత్రం తేలిపోయి పాయింట్ల పట్టికలో వెనకబడి పోయింది. బుధవారం (ఏప్రిల్ 23) ఉప్పల్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ టోర్నీలో ఆరో ఓటమిని చవిచూసింది. ఈ ఫలితంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఎస్సార్‌హెచ్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ అయితే.. ఔట్ కాకున్నా, పెవిలియన్ బాట పట్టిన తీరుపై నెట్టింట విమర్శలు, మీమ్స్ వర్షం కురుస్తోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. ఓ దశలో 13/4.. 35/5తో నిలిచి స్వల్ప స్కోరుకే కుప్పకూలేలా కనిపించింది. కానీ హెన్రిచ్ క్లాసెన్ (44 బంతుల్లో 71 రన్స్‌), ఇంపాక్ట్ ప్లేయర్‌ అభినవ్‌ మనోహర్‌ (37 బంతుల్లో 43 రన్స్) పోరాడటంతో 140 పరుగుల మార్కును దాటించింది. చివరకు 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు స్కోరు చేసింది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ అత్యధికంగా 4 వికెట్లు తీశాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News