ఛాందస ముస్లిం ఉగ్రవాదుల దుర్మార్గ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం హైదరాబాద్
లోకల్ గైడ్ :
తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఛాందస ముస్లిం ఉగ్రవాదులను జల్లెడ పట్టాలి .పాలస్తీనా తరహాలో ఉగ్రవాదుల తండాలను ఏరివేయాలి. ఉగ్రవాదుల ఘాతుకాన్ని ముస్లిం మతస్థులు వ్యతిరేకిస్తూ ర్యాలీలు చేయాలి. ఓటు బ్యాంకు రాజకీయాలను ప్రోత్సాహించే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలను ప్రజలు నిలదీయాలి జై స్వరాజ్ పార్టీ జమ్ము కాశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ముస్లిం ఉగ్రదాడిలో అసువులు బాసిన వారికి జై స్వరాజ్ పార్టీ నివాళులు అర్పిస్తోందని, మతం పేరుతో ముస్లిం ఉగ్రవాదుల ఈ దాడి అమానవీయం, హేయమైన చర్య అని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ దాడిలో జీవితాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తమ పార్టీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోందని ఆయన అన్నారు. ఛాందస ముస్లిం ఉగ్రవాదుల సమూల నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక నిఘా విభాగం ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా ఉన్న ఉన్మాద ముస్లిం ఉగ్రవాదులను ఏరివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకప్పుడు పాలస్తీనాలో దాడులు జరిగితే ప్రపంచ వ్యాప్తంగా పాలస్తీనా ప్రజలకు మద్దతు పలికే వారని, ఇప్పుడు పాలస్తీనా అస్థిత్వం లేకుండా చేస్తున్నా అయ్యో అనే వారు లేని పరిస్థితి అక్కడి ఉగ్రవాదులు తెచ్చుకున్నారని, ఆ పరిస్థితి భారత్ లో ఉన్న ఛాందస ముస్లిం ఉగ్రవాద తండాలు తెచ్చుకోవద్దని ఆయన అన్నారు. భారత దేశాన్ని ప్రేమించే ముస్లిం ప్రజలు, మత గురువులు భారత మాతృ దేశ సంరక్షణ కోసం ముస్లిం ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడాలని, లేకపోతే వారికి ఈ ఉగ్రవాదం భస్మాసుర హస్తంగా మారుతుందని కేఎస్ఆర్ గౌడ అన్నారు. స్వాతంత్ర్యం తరువాత కాంగ్రెస్ పార్టీ ఒక మత అనుకూల విధానాల వల్ల దేశంలో పహల్గామ్ లాంటి దుర్మార్గాలు కొనసాగుతున్నాయని, మరో వైపు బిజేపి తమ ఎదుగుదలకు ఎంఐఎం లాంటి పార్టీలను పరోక్షంగా ప్రోత్సాహిస్తూ దేశ ప్రజలకు అయోమయ పరిస్థితి కల్పిస్తోందని ఆయన అన్నారు. ఇక నిజాంను కూలదోసిన తెలంగాణలో మత రాజకీయాలు చేస్తూ బీఆర్ఎస్ పదేళ్లు కాలం గడిపిందని, ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే కుహన లౌకిక పార్టీలతో ఈ దేశ ప్రజలకు ముప్పు పొంచి ఉందని కేఎస్ఆర్ గౌడ హెచ్చరించారు. మతాలకు అతీతంగా దేశ ప్రజలు ఛాందస మత ఉగ్రవాదుల ఘాతుకాన్ని తీవ్రంగా ఖండించాలని, దేశ ప్రధాని నరేంద్ర మోడీ తక్షణమే ఉగ్రవాదుల ఏరివేతకు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, ఈ ఉగ్రవాదాన్ని ప్రోత్సాహించే పాకిస్థాన్ లాంటి దేశాలపై చర్యలకు ఇదే సరైన సమయమని కేఎస్ఆర్ గౌడ సూచించారు.
Comment List