అక్రమంగా డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన నల్లగొండ 1 టౌన్ పోలీస్.  

నల్లగొండ డి.ఎస్.పి కే. శివరాం రెడ్డి.

అక్రమంగా డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన నల్లగొండ 1 టౌన్ పోలీస్.  

లోకల్ గైడ్:

అక్రమంగా డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన నల్లగొండ 1 టౌన్ పోలీస్. వీరి వద్ద నుండి 25,000 విలువగల 2400 స్పాస్మో టాబ్లెట్స్, ఒక బైక్, 22,000 నగదు, రెండు సెల్ ఫోన్లు, షాప్ లైసెన్స్ డాక్యుమెంట్స్ స్వాధీనం. మెడికల్ షాప్ నిర్వాహకులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా డ్రగ్స్ అమ్మినట్లయితే షాప్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తప్పవు.నల్లగొండ జిల్లాను డ్రగ్స్ మరియు గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో,గౌరవ జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్  మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది యువతకు డ్రగ్స్ మరియు గంజాయి తీసుకోవడం వలన జరిగే అనర్ధాల పై వివరిస్తూ అవగాహన కల్పించడం, డ్రగ్స్ అలవాటు పడిన యువతకు  రిహాబిలిటేషన్ మరియు వైద్యసహాయం కూడా అందించి వారిని తిరిగి మామూలు వ్యక్తుల్లాగా మార్చడం జరిగింది.చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తును దృష్టి లో ఉంచుకొని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ గంజాయి మరియు డ్రగ్స్ పట్ల సమాచారం ఇవ్వడం చాలా కీలక పరిణామం.  అయితే కొంతమంది యువత డ్రగ్స్ కి బానిసై, తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపించి నేరాలకు పాల్పడుతున్నారు. ఈనెల 23న 11 గంటల సమయంలో మునుగోడు రోడ్ లో నల్గొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై సందీప్ రెడ్డి మరియు అతని సిబ్బంది మునుగోడు రోడ్డులో వాహన తనిఖీ నిర్వహిస్తుండగా, ఒక వ్యక్తి అనుమానాస్పదంగా బైక్ పై బ్యాగుతో ఉండగా, అతన్ని పట్టుబడి చేసి విచారించగా, అతని పేరు మమ్మద్ ఖాజా వసీముద్దీన్@ వసీం అక్సం(A1), వయసు 38, వృత్తి. బిజినెస్.r/o. అక్కచెల్మ గత కొంతకాలంగా స్పాస్మో టాబ్లెట్స్ సేవిస్తూ వాటికి బానిసై, ఈజీగా డబ్బులు సంపాదించాలని వసీం, అతని స్నేహితులైన A2 -కాజా షోయబ్ r/o. అక్కచెల్మ మరియు A3 -అమేర్ r/o. అక్కచెల్మ( ఇద్దరు పరారీ లో ఉన్నారు) నల్గొండ చుట్టుపక్కల మెడికల్ షాపులలో ఇట్టి టాబ్లెట్స్ అమ్మట్లేదని, పోలీసువారికి ఇక్కడ నిఘా ఉంటుందని, ఆరు నెలల నుండి పిడుగురాళ్ల లోని ఛాయా మెడికల్ షాప్ నిర్వాహకుడైన A4 -మణిదీప్ దగ్గరికి బైక్ పై వెళ్లి ఒక షీటును వంద రూపాయలకు కొని, అట్టి టాబ్లెట్స్ ను వినియోగిస్తూ, మరియు అవసరం ఉన్నవారికి 180 రూపాయలకు అమ్ముతూ డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో మమ్మద్ వసీముద్దీన్ 288 టాబ్లెట్స్ షీట్స్ తీసుకుని, అవసరం ఉన్నవారికి అమ్ముదామని వెళుతూ ఉండగా పట్టుబడడం జరిగింది. ఇతడిని తీసుకొని గురజాలలోనే మెడికల్ షాప్ నిర్వాహకుడైన మణి దీపిని పట్టుబడి చేసి, అతని వద్ద నుండి 15 షీట్స్, సెల్ ఫోన్, షాపు డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది.అలాగే పట్టుబడిన వసీముద్దీన్ మరియు మణిదీప్ లను కోర్టుకు జ్యుడీషియల్ రిమాండ్ కి పంపిస్తూ, సీజ్ చేసిన టాబ్లెట్స్, బైక్, నగదు, సెల్ ఫోన్లను కోర్టుకు సమర్పించడం జరిగింది.నిందితుల వివరాలు. 
A1 - మహ్మద్ ఖాజా వసీముద్దీన్ అలియాస్ వసీం అక్సం వయసు 38 , వృత్తి. బిజినెస్ నివాసం.అక్కచెల్మ, నల్గొండ
A2 - ఖాజా షోయబ్ r/o. అక్కచెల్మ, నల్గొండ  ( పరారీ)
A3- షేక్  అమేర్ r/o. అక్కచెల్మ, నల్గొండ ( పరారీ)
A4- కొప్పుర వారి యశ్వంత్ మణిదీప్ s/o. శ్రీనివాస రావు, 29, వృత్తి. బిజినెస్ r/o. పిడుగురాళ్ల, పల్నాడు జిల్లా. మెడికల్ షాప్ నిర్వాహకులు, ఎట్టి పరిస్థితులలో కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి టాబ్లెట్స్ అమ్మరాదని, ఒకవేళ అధిక డబ్బులు సంపాదించాలని లక్ష్యంతో  అమ్మినట్లయితే తప్పకుండా జైలుకి వెళ్ళడం మరియు షాప్ లైసెన్స్ రద్దు చేయడం ఖాయమని హెచ్చరిస్తూ, డ్రగ్స్ రహిత సమాజ స్థాపనలో మెడికల్ షాప్ వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం అవుతూ, వారి వంతు బాధ్యతగా ఎవరైనా యువత అనుమానాస్పదంగా ఇట్టి టాబ్లెట్స్ గురించి వచ్చినట్లయితే వెంటనే 100 కి గాని సమీప పోలీస్ స్టేషన్ గాని సమాచారం అందించాలని సూచించారు.ఇట్టి కేసులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆధ్వర్యంలో ఎస్సైలు శంకర్, సందీప్ రెడ్డి, కానిస్టేబుల్స్ రబ్బాని వెంకటనారాయణ, కిరణ్, షకీల్, శ్రీకాంత్, సైదుల్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అభినందించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News